Minister Chelluboyina Venu: పవన్ కళ్యాణ్.. ముందు నీ అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకో.. చంద్రబాబుకోసం పనిచేయకు

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసేది తనకోసం, జనసేన పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తల కోసం కాదని, చంద్రబాబుకోసం చేస్తున్నాడంటూ మంత్రి చెల్లుబోయిన వేణు విమర్శించారు.

Minister Chelluboyina Venu: పవన్ కళ్యాణ్.. ముందు నీ అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకో.. చంద్రబాబుకోసం పనిచేయకు

Minister Chelluboyina VenuGopal

Updated On : June 15, 2023 / 10:09 AM IST

Minister Venu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన తొలి బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీసంఖ్యలో వారాహి యాత్రలో పాల్గొన్నారు. పవన్ వారాహి యాత్రపై మంత్రి చెల్లుబోయిన వేణు విమర్శలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం జరిగిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అట్టర్ ప్లాప్ అయిందని అన్నారు. చిరంజీవి వేసిన దారివల్ల పవన్‌కు అభిమానులు ఏర్పడ్డారని, వారి నమ్మకాన్ని పవన్ నిలబెట్టుకోలేక పోతున్నాడని చెప్పారు.

Chandrababu Naidu : అన్నీ లెక్క పెడుతున్నా, వడ్డీతో సహా చెల్లిస్తాం- చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసేది తనకోసం, జనసేన పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తల కోసం కాదని, చంద్రబాబుకోసం చేస్తున్నాడంటూ మంత్రి విమర్శించారు. పవన్ చంద్రబాబుకోసం పనిచేయడం మానేసి అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఏమీ ఆశించకుండా ప్రతిఒక్కరికి న్యాయం చేయాలని చూడటం జగన్మోహన్ రెడ్డి అభిమాతం అన్నారు. ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని, ఎన్ని పార్టీలు ఏకమైనా మళ్లీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మంత్రి అన్నారు.

Pawan Kalyan: భవిష్యత్తులో వైసీపీని ఎదుర్కొనేది జనసేన పార్టీ మాత్రమే.. ఎలాగంటే?: పవన్ కల్యాణ్

బీసీలు ఇప్పుడు 34% రిజర్వేషన్ ఉండటానికి కారణం గతంలో సకాలంలో ఎలక్షన్లు జరపకపోవడమేనని, సుప్రీంకోర్టుకు 50% నిబంధన‌పై గత ప్రభుత్వం సరైన క్లారిటీ ఇవ్వకపోవడం కారణమన్నారు. సుప్రీంకోర్టులో బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవడం చంద్రబాబు చేసిన పని అని మంత్రి వేణు విమర్శించారు. నాలుగు రోజులు పోతే పవన్ కళ్యాణ్ యాత్రకూడా ప్లాపేనని మంత్రి జోస్యం చెప్పారు.