జగన్ అధికార దాహానికి పరాకాష్ఠ ఇది : ఉమ ఉగ్రరూపం

జగన్ సీఎం నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం.. ఆయన పిచ్చికి పరాకాష్టకు నిదర్శం అంటూ తిట్టిపోశారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. పీకే ఇచ్చిన సలహాలతో.. జగన్ ఏం చేస్తున్నాడో తెలికుండా వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే ఫలితాలు రావటానికి ముందే జగన్ సీఎం నేమ్ ప్లేట్ తయారు చేయించుకోవటం ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. పీకే టీమ్ జగన్ ఇచ్చే పేపెంట్ కోసమే ఆయన్ను భ్రమల్లో ఉంచుతోందని ఎద్దేవా చేశారు ఉమ. ఓటింగ్ శాతం పెరగకుండా నియంత్రించేందుకు ఈసీ కుట్ర చేసిందని ఆరోపించారు దేవినేని. టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్న పోలింగ్ బూత్ లలోనే ఈవీఎంలు పనిచేయలేదని.. ఈసీ చేసిన కుట్రలో భాగమేనని విమర్శించారు.
ఢిల్లీలో చంద్రబాబు ఈవీఎంలపై చేపట్టిన పోరాటంతోనే ఇతర పార్టీలన్నీ మేలుకున్నాయన్నారు దేవినేని ఉమ. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు.. సీఎం నేమ్ ప్లేట్ సిద్ధం చేసుకోవటం అంటే.. జగన్ కు పట్టిన అధికార దాహానికి పరాకాష్టగా కనిపిస్తోందన్నారు దేవినేని ఉమ.
వైసీపీ గెలుపుపై ఆ పార్టీ ముందు నుంచి ధీమాగా ఉంది. నోటిఫికేషన్ ముందే ‘కౌంట్ డౌన్’ క్లాక్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11 పోలింగ్ తేదీ నాటికి ఆ కౌంట్ డౌన్ పూర్తయ్యేలా సెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత జగన్ ‘నేమ్ సీఎం నేమ్ ప్లేట్ ’ వైరల్‌గా మారింది. ఈ విషయంపై దేవినేని ఎద్దేవా చేశారు.