రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ.. మంత్రి కందుల దుర్గేశ్ ఏమన్నారంటే?
మరికొన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వస్తే మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

విశాఖలోని రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ హర్షం వ్యక్తం చేశారు. రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణకు కృషి చేస్తామని అసెంబ్లీలో ఆయన మాట ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ మేరకు రుషికొండ బీచ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చి బ్లూ ఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకున్నారు. యుద్ధప్రాతిపదిక పర్యాటక శాఖాధికారులకు దిశానిర్దేశం చేస్తూ కొద్ది కాలంలోనే బ్లూఫ్లాగ్ పునరుద్ధరణకు కృషి చేశారు.
బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ కోసం సంబంధిత అధికారులు తీసుకున్న చొరవపై కందుల దుర్గేశ్ ప్రశంసలు కురిపించారు. బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు ప్రోత్సహించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు.
Allu Arjun: అబుదాబిలోని ఆ మందిరంలో అల్లు అర్జున్.. వీడియో చూశారా?
దేశంలో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన మొదటి ఎనిమిది బీచ్‌లలో రుషికొండ ఒకటని కందుల దుర్గేశ్ చెప్పారు. నిరంతరం రుషికొండ బీచ్ లో నిర్వహణ కార్యక్రమాలు సక్రమంగా చేపట్టేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేట్ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపామన్నారు.
మరికొన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వస్తే మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రుషికొండ బీచ్ కు బ్లూఫాగ్ హోదాను డెన్మార్కుకు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రకటించింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన రుషికొండ బీచ్ లో మళ్లీ రెపరెపలాడుతోంది నీలి రంగు జెండా.