KannaBabu: జగన్ అంటే పవన్‌కు జెలసీ – మంత్రి కన్నబాబు

ఇండస్ట్రీకి మేలు చేసే విషయంలో ప్రభుత్వం బాధ్యతగా ఉంది. మంత్రుల్ని సన్నాసులని తిడితే గొప్ప కాదు.. అదే మీకున్న సంస్కారమని జనం అనుకుంటున్నారు.

KannaBabu: జగన్ అంటే పవన్‌కు జెలసీ – మంత్రి కన్నబాబు

Minister Kannababu

Updated On : September 28, 2021 / 4:26 PM IST

KannaBabu:  పవన్‌లో ఓటమి బాధ ఇంకా పోలేనట్టు ఉందన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. సీఎం జగన్ పట్ల జెలసీ పవన్ కళ్యాణ్‌లో అణువణువూ కనిపిస్తోందన్నారు. తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు కన్నబాబు.

“ఎక్కడికి వెళ్లినా జగన్ ని తిట్టడమే పవన్ పనిగా పెట్టుకున్నాడు. మొన్నటి రిపబ్లిక్ ప్రి-రిలీజ్ ఫంక్షన్ లో పవన్ మాటలు చాలా చిల్లరగా ఉన్నాయి. పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ కులాల ప్రస్తావన ఏంటి..? చంద్రబాబు, పవన్ మధ్య బంధం కొనసాగుతూనే ఉంది.. ఎక్కడా వదులుకోలేదు. బీజేపీతో అధికారిక పొత్తులో ఉన్నా టీడీపీకి అనుకూలంగానే ఉంటున్నాడు. బీజేపీతో ఉండాలా.. టీడీపీతో వెళ్లిపోవాలో తెలియక పవన్ ఒత్తిడిలో ఉన్నాడు” అని కౌంటర్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్‌కు మంత్రి అప్పలరాజు కౌంటర్

“సినిమా రంగంలో ఇంతవరకూ అందరూ కులాలకు అతీతంగా ఉన్నారు. పవన్ కులాల ప్రస్తావన తెచ్చారు. చిరంజీవి, దాసరి, మోహన్ బాబు ఎప్పుడూ కులాల ప్రస్తావన తీసుకురాలేదు. అంతా సినిమా కులంగా ఉన్నారు. ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ తీసుకురావాలని కేంద్రం సూచనలు చేసిందని సినిమా పెద్దలే చెబుతున్నారు. పవన్ కి చిత్తశుద్ధి ఉంటే ఆన్ లైన్ టికెటింగ్ వద్దు అని కేంద్రానికి లేఖ రాయాలి” అని డిమాండ్ చేశారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి.

పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సీరియస్

“ఇండస్ట్రీకి మేలు చేసే విషయంలో ప్రభుత్వం బాధ్యతగా ఉంది. మంత్రుల్ని సన్నాసులని తిడితే గొప్ప కాదు.. అదే మీకున్న సంస్కారమని జనం అనుకుంటున్నారు. రాజకీయాల్లో హుందాగా ఎలా ఉండాలో జగన్ ని చూసి పవన్ నేర్చుకోవాలి. ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరిస్తుంటే పవన్ కి అంత బాధ ఎందుకు..? ఇండస్ట్రీ జగన్ కి దగ్గర అవుతుందని భయపడుతున్నారెమో..? ఇండస్ట్రీ మంచికోసం సీఎం జగన్ చెయ్యాలి అనుకున్నది చేసి తీరుతారు. జనానికి మంచి చేసే పనిలో ఉన్న సీఎంకు… పవన్ ని పట్టించుకునే తీరిక లేదు” అన్నారు కన్నబాబు.