మద్యపాన నిషేధం పేరుతో ప్రజలను దోచుకున్నారు- జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
మద్యానికి సంబంధించి జే బ్రాండ్ రూపొందించారని అన్నారు. మల్టీ నేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా చేశారని చెప్పారు.

Kollu Ravindra (Photo Credit : Google, Facebook)
Kollu Ravindra : ప్రజా ఆరోగ్యం దృష్ట్యా కొత్త ఎక్సైజ్ విధానం రావాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. క్షేత్రస్థాయిలో సంఘాల నుంచి నివేదికలు తెప్పించుకున్నామని తెలిపారు. క్యాబినెట్ భేటీలో నివేదిక సమర్పిస్తామన్నారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెంచారని ఆరోపించారు.
Also Read : పవన్ కల్యాణ్‌పై వైసీపీ వైఖరి మారిందా? ఏం జరుగుతోందో తెలుసా?
మద్యపాన నిషేధం చేస్తామని మాయమాటలు చెప్పారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన ఫైర్ అయ్యారు. గతంలో మద్యం దుకాణాల్లో సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టారని జగన్ పై ధ్వజమెత్తారు మంత్రి కొల్లు రవీంద్ర. మద్యానికి సంబంధించి జే బ్రాండ్ రూపొందించారని అన్నారు. మల్టీ నేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా చేశారని చెప్పారు. ప్రభుత్వ ఆదాయం గత పాలకుల జేబుల్లోకి వెళ్లిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
రాష్ట్రంలో అమలు చేయనున్న కొత్త మద్యం పాలసీపై మహిళా సంఘాలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ తెలిపారు. అటు, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం చేసింది. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం.
నూతన మద్యం పాలసీ రూపకల్పనకు చంద్రబాబు సర్కార్ ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, సత్యకుమార్, కొంపల్లి శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న లిక్కర్ పాలసీని సమీక్షించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మద్యం విధానంపై అధ్యయనం చేసింది. పాలసీ రూపకల్పనకు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుంది.