Mana Illu Mana Lokesh: మంగళగిరిలో ‘మన ఇల్లు-మన లోకేశ్’.. 3 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
Mana Illu Mana Lokesh: ‘మన ఇల్లు- మన లోకేశ్ (Nara Lokesh)’ కార్యక్రమంలో భాగంగా ఆయన చేతుల మీదుగా 3,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
Minister Lokesh distributed house site pattas to 3,000 people in Mana Illu - Mana Lokesh program.
- పేదలకు నారా లోకేశ్ గిఫ్ట్
- మూడు వేల పట్టాల పంపిణీ
- వెయ్యి కోట్ల ఆస్తి హక్కు
Mana Illu Mana Lokesh: ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాలను జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ‘మన ఇల్లు- మన లోకేశ్ (Nara Lokesh)’ కార్యక్రమంలో భాగంగా ఆయన చేతుల మీదుగా 3,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద కుటుంబాలకు రూ. 1,000 కోట్ల విలువైన ఆస్తిని పట్టాల రూపంలో అందించడం గమనార్హం.
Also Read: బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ అలర్ట్.. రీ-కేవైసీ చేయండి.. లేదంటే అకౌంట్ ఫ్రీజ్, డబ్బులు లాక్!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు: లోకేశ్ వివరణ
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టే నాటికి ఆదాయం ఒక్క రూపాయి ఉంటే, ఖర్చు రూ.1.60 పైసలుగా ఉండేదని లోకేశ్ తెలిపారు. అయితే గత రెండేళ్లలో చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి ఫలితంగా ఆ ఖర్చును రూ.1.40కి తగ్గించగలిగామని వివరించారు. ఈ శాశ్వత భూపట్టాలతో (Mana Illu Mana Lokesh) పేదల ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తుందని, వీటిని ఎవరూ కదిలించలేరని హామీ ఇచ్చారు.
దేశంలోనే నంబర్ వన్‌గా మంగళగిరి: మంత్రి ధీమా
2019 ఎన్నికల ఓటమి తర్వాత తనతో పాటు చంద్రబాబును కూడా కొందరు అవహేళన చేశారని, ఆ కసితోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నానని లోకేశ్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యుత్తమంగా, నంబర్ వన్ స్థానంలో నిలబెడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
