మాజీ సీఎం జగన్‍పై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు

నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు.

మాజీ సీఎం జగన్‍పై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు

Minister Nara Lokesh : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్.. ఏపీ మీ తాత జాగీరా? అని ఫైర్ అయ్యారు. వైసీపీ కోసం 26 జిల్లాలలో 42 ఎకరాలకుపైగా వెయ్యి రూపాయలతో 33 ఏళ్ల లీజు కేటాయించారని ఆరోపించారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కడుతున్నారని మండిపడ్డారు. మీ భూదాహానికి కబ్జా అయిన 42 ఎకరాల్లో 4వేల 200 మంది పేదలకు సెంటు స్థలం ఇవ్వొచ్చన్నారు. మీ విలాసాల ప్యాలెస్ నిర్మాణాలకు అయ్యే 500 కోట్లతో 25వేల మందికి ఇళ్లు కట్టొచ్చని చెప్పారు. ఈ ప్యాలెస్ పిచ్చి ఏంటి? మీ ధన దాహానికి అంతులేదా? అని ప్రశ్నించారు మంత్రి నారా లోకేశ్.

”జగన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4వేల 200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు.
ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి?
నీ ధనదాహానికి అంతులేదా?” అంటూ ట్వీట్ లో జగన్ పై నిప్పులు చెరిగారు నారా లోకేశ్.

Also Read : పరిపాలన, ప్రజాసేవపై బాబు, పవన్ ఫోకస్.. ఏం చేస్తున్నారో తెలుసా?