Nara Lokesh: ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేశ్.. వారి ఇంటిపై అప్పు తీర్చేశారు

మంత్రి నారా లోకేశ్ కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

Nara Lokesh: ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేశ్.. వారి ఇంటిపై అప్పు తీర్చేశారు

Updated On : June 18, 2025 / 6:58 PM IST

Nara Lokesh: టీడీపీ యువ నేత, మంత్రి నారా లోకేశ్ కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మే21వ తేదీన బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి లోకేశ్ ఉండవల్లి నివాసానికి పిలుపించుకొని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఆ సమయంలో తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టులో ఉందని బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పార్టీ కోసం జీవితాంతం కష్టపడిన బాలకోటిరెడ్డి కుటుంబానికి పెద్దకొడుకులా జీవితాంతం అండగా ఉంటానని లోకేశ్ భరోసా ఇచ్చారు. అయితే, తాజాగా.. ఇచ్చిన హామీని లోకేశ్ నిలబెట్టుకున్నారు.

దివంగత వెన్నా బాలకోటిరెడ్డి ఇంటిపై తీసుకున్న రుణాన్ని మంత్రి లోకేశ్ తీర్చారు. ఆయన సతీమణి వెన్నా నాగేంద్రమ్మకు నెలనెలా ఆర్థిక సాయం అందజేస్తూ ఇచ్చిన మాట ప్రకారం.. ఇంటికి పెద్దకొడుకులా లోకేశ్ నిలిచారు. లోకేశ్ తీరుపట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.