Schools: పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి కొత్త కార్యక్రమం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Schools: పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి కొత్త కార్యక్రమం

school students games

Updated On : March 23, 2025 / 1:30 PM IST

Schools: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఏపీ విద్యాశాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతినెల మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నుంచి ప్రతీ శనివారం దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read: విద్యార్థిని తండ్రి నిర్ణయం.. అధికారులను కదిలించింది.. మూతపడే బడిని బతికించింది..!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. అంతేకాక ఓ వీడియోనుసైతం షేర్ చేశారు. లోకేశ్ ట్వీట్ ప్రకారం.. ‘‘ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు మూడో శనివారం మాత్రమే ఉన్న నో బ్యాగ్ డేని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలుచేస్తాం. ఆ రోజు విద్యార్థులకు క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తాం.’’ అని లోకేశ్ పేర్కొన్నారు.

Also Read: Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగ్ షాక్.. ఏసీబీ కేసు నమోదు

నో బ్యాగ్ డే వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాలతో కూడిన వీడియోను కూడా మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఇదిలాఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.