Nara Lokesh: రేపు ఉదయం 9 గంటలకు.. బిగ్ అన్‌వీల్.. సంచలనం రేపుతున్న లోకేశ్ ట్వీట్..

లోకేశ్ ప్రస్తావించిన కంపెనీ ఏది? ఏ రేంజ్ లో పెట్టుబడి పెట్టబోతోంది? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.

Nara Lokesh: రేపు ఉదయం 9 గంటలకు.. బిగ్ అన్‌వీల్.. సంచలనం రేపుతున్న లోకేశ్ ట్వీట్..

Updated On : November 12, 2025 / 7:28 PM IST

Nara Lokesh: గురువారం ఉదయం 9 గంటలకు.. బిగ్ అన్ వీల్.. అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లో చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఏపీ రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో విస్తృతమైన చర్చకు తెరలేపింది. ఇంతకీ లోకేశ్ చేసిన ట్వీట్ ఏంటి? దేని గురించి ఆయన హింట్ ఇచ్చారు? పొలిటికల్, ఇండస్ట్రియల్ సర్కిల్స్ లో ఎందుకు డిస్కషన్ జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళితే..

”2019లో కొత్త ప్రాజెక్టులు నిలిపివేసిన ఒక కంపెనీ రేపు తుఫాన్ లా ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వస్తోంది. అది ఎవరు? 9 AMకు బిగ్ అన్ వీల్! స్టే ట్యూన్డ్” అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

మంత్రి లోకేశ్ చేసిన ఈ ట్వీట్ రాష్ట్ర రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఐదేళ్ల క్రితం ప్రాజెక్టులు నిలిపివేసిన ఆ కంపెనీ ఏది? ఏపీకి తిరిగి రానున్న ఆ ప్రముఖ పరిశ్రమ ఏది? మంత్రి లోకేశ్ ట్వీట్ చేసింది ఏ సంస్థను ఉద్దేశించి? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. దీని గురించి పలు రకాలుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడం, కొత్త పెట్టుబడులను ఆహ్వానించడం వంటి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ప్రస్తావించిన కంపెనీ ఏది? ఏ రేంజ్ లో పెట్టుబడి పెట్టబోతోంది? అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఆ కంపెనీ ఏదో తెలియాలంటే.. గురువారం ఉదయం 9 గంటల వరకు నిరీక్షణ తప్పదు.

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ అదే పని మీద ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు దేశ విదేశాల్లో పర్యటిస్తున్నారు. దిగ్గజ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుంటున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ మెంట్స్ చేసేలా వారితో చర్చలు జరుపుతున్నారు.

Also Read: “ఇలాగైతే మీకే నష్టం” అంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. ఇకపై..