అదే జరిగి ఉంటే ఆ 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవి..!- మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

40 టన్నులు ఉన్న ఒక్కో బోటును మూడు బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్ కి పంపడం దుర్మార్గం అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.

అదే జరిగి ఉంటే ఆ 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవి..!- మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

Minister Nimmala Ramanaidu (Photo Credit : Google)

Updated On : September 11, 2024 / 1:36 AM IST

Minister Nimmala Ramanaidu : ప్రకాశం బ్యారేజ్ లో నీటిలో చిక్కుకున్న బోట్ల తొలగింపు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బోట్ల వెలికితీతకు అధికారులు, బేకం సంస్థ సర్వ ప్రయత్నాలు చేస్తున్నా ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పారు. బోట్లు ఒక్కొక్కటిగా కాకుండా మూడు బోట్లు కలిపి లింక్ ఉండటంతో వెలికి తీయడంలో సమస్యలు వస్తున్నాయన్నారు. 40 టన్నులు ఉన్న ఒక్కో బోటును మూడు బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్ కి పంపడం దుర్మార్గం అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.

బోట్లు.. బ్యారేజీ కౌంటర్ వెయిట్స్ ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవి అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యారేజీ, ప్రజల భద్రత దృష్ట్యా బోట్లను అండర్ వాటర్ కేటింగ్ చేయడానికి విశాఖ నుండి ప్రత్యేక టీమ్ లు వస్తున్నాయని మంత్రి నిమ్మల తెలిపారు. 120 టన్నుల ఎయిర్ బెలూన్స్ తీసుకొస్తున్నారని వెల్లడించారు.

అత్యధిక వరద సమయంలో కూడా కోటి 50 లక్షల విలువ చేసే బోట్లను లంగరు వేసుకోలేదంటేనే ఉద్దేశ్య పూర్వక కుట్ర అని అర్థం అవుతుందన్నారు. ఈ ఘటనలో నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి తేల్చి చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా పనులు చేయాలని మంత్రి నారా లోకేశ్ సూచించారని మంత్రి తుమ్మల తెలిపారు. ఇవాళ్టి సాయంత్రానికి బోట్లు తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు.

Also Read : భారీ క్రేన్లతో 6 గంటలు శ్రమించినా ఇంచు కూడా కదలని బోట్లు.. ప్లాన్-సి అమలు చేయనున్న అధికారులు..!