Perni Nani : టీడీపీ రైతుల పాదయాత్రపై మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్!

టీడీపీ నేతల రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దొంగ పాదయాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Perni Nani : టీడీపీ రైతుల పాదయాత్రపై మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్!

Minister Perni Nani Aggressive Comments On Tdp Amaravati Farmers Padayatra

Updated On : November 12, 2021 / 4:31 PM IST

Minister Perni Nani : టీడీపీ అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దొంగ పాదయాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పేర్ని మాట్లాడుతూ.. రైతుల్ని మోసం చేసి వారి పేరుతోనే రియల్ ఎస్టేట్ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ యాత్రకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఆ పాదయాత్రలో వాస్తవమైన రైతులు ఎవరు లేరన్నారు. ఉన్నవారంతా టీడీపీ వారేనని మంత్రి పేర్ని నాని విమర్శించారు. కోర్టు, న్యాయమూర్తుల కళ్లు కప్పి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు.

ఈ పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, స్ర్కీన్ ప్లే మొత్తం చంద్రబాబేనని పేర్ని నాని విమర్శించారు. టీడీపీ నేతలు చేపట్టిన ఈ యాత్రకు చందాల పేరుతో చంద్రబాబు అండ్ కో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. తనకు తెలిసిన ఓ టీడీపీ నేత కూడా 50 లక్షల వరకు వాళ్ల చంచుల్లో వేసినట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. యాత్ర రూట్ మ్యాప్ వెనుక కుట్ర దాటి ఉందన్నారు. ఘర్షణలకు దారితీసేలా ఉందన్నారు. బీసీ, ఎస్సీ, మైనారిటీలను కవ్వించే విధంగా రూట్ మ్యాప్ ప్లాన్ చేశారని పేర్ని నాని అనుమానం వ్యక్తం చేశారు.

పాదయాత్రలో రైతుల ముసుగులో టీడీపీ నేతలు పోలీసులపై దాడులకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. తన ఆస్తుల కోసం అమరావతి తప్పా రాష్ట్రంలో ఇంకో ప్రాంతం అభివృద్ధి జరగకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. కృష్ణా,గుంటూరు జిల్లా వాసులు సీఎం జగన్‌కు మద్దతుగా ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి గడ్డిపెట్టి వైసీపీ‌కే ఇక్కడి ప్రజలు పట్టం గట్టారని, మా నాన్న దేవుడు అంటున్న లోకేష్‌ని పిచ్చాసుపత్రికి తీసుకువెళ్లాలని అన్నారు. ఎన్నికల్లో డబ్బు సంప్రదాయం తెచ్చింది చంద్రబాబేనని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఆయనతోనే మొదలు.. ఆయనతోనే అంతం కావాలన్నారు.

కుప్పంలోనూ ఓటుకి 2 వేలు ఇవ్వడానికి టీడీపీ నేతలు తిరుగుతున్నారని, 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న మీ నాన్న హంద్రీనీవాలో నీళ్లు ఎందుకు తీసుకురాలేదో అడుగాలని సూటిగా ప్రశ్నించారు. 1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉంటున్న చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలన్నారు. 25 వేల ఓటర్ల ఉన్న కుప్పం మున్సిపాలిటీ కోసం ఇన్ని సర్కస్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్‌ని చదువుకోడానికి అమెరికా పంపితే భూతులు, అపార్ధాలు, కుట్రలు నేర్చుకుని వచ్చాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో పారిపోయి కరకట్టమీదకి వచ్చిన మీరు ధైర్య వంతులా..? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.
Read Also : Kangana Ranaut: ‘స్వాతంత్ర్యం భిక్షతో పోల్చిన కంగనా పద్మ శ్రీ వెనక్కు ఇచ్చేయాలి’