Minister Roja: బైబై తుప్పు.. బైబై పప్పు.. పిల్ల సైకో అంటూ.. నారా లోకేశ్ ట్వీట్‌కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్

లోకేశ్ ట్వీట్‌కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ డాడీ.. కేడి కాబట్టే అరెస్ట్ అయ్యాడు పిల్ల సైకో...

Minister Roja: బైబై తుప్పు.. బైబై పప్పు.. పిల్ల సైకో అంటూ.. నారా లోకేశ్ ట్వీట్‌కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్

minister Roja

Updated On : September 9, 2023 / 8:02 PM IST

Minister Roja Strong Counter To Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఏపీలోని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తూ టీడీపీ కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే శనివారం ఉదయం చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన కొద్ది సేపటికే నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘ పిచ్చోడు లండన్ కి…మంచోడు జైలుకి…ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు.. మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్’ అంటూ లోకేశ్ ట్వీట్ లో పేర్కొన్నాడు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు పోలీసుల నుంచి మెయిల్.. విజయవాడ పర్యటన రద్దు.. నాదెండ్ల మనోహర్ ఆగ్రహం

లోకేశ్ ట్వీట్‌కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ డాడీ.. కేడి కాబట్టే అరెస్ట్ అయ్యాడు పిల్ల సైకో. మంచోడు కాదు సూట్ కేస్ కంపెనీలతో ముంచేసినోడు మీ నాన్న. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాని జైలుకి పంపక.. జైలర్ సినిమాకి పంపిస్తారా? అంటూ రోజా ప్రశ్నించారు. పప్పుమీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే `ఈ కుంభకోణంలో విచారణ జరుపుకొండి..` అని ధైర్యంగా చెప్పు..!! అంటూ రోజా సవాల్ విసిరారు. ఏ1 చంద్రబాబును ఇక ఏ దేవుడు కాపాడలేడు.. మీ తాత ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు సంతోషంగా ఉంటుంది. బై బై తుప్పు.. బై బై పప్పు.. రోజా ట్వీట్ చేశారు.