CM Jagan : చంద్రబాబు మోసం చేసి అవమానిస్తే.. జగన్ తలెత్తుకునేలా చేశారు- వైసీపీ మంత్రులు

చంద్రబాబు వెంట ఉన్న బీసీ నాయకులు తల ఎక్కడ పెట్టుకుంటారు? రాష్ట్రంలోని యాదవులంతా కావాలి జగన్.. కావాలి జగన్.. అంటున్నారు.

CM Jagan : చంద్రబాబు మోసం చేసి అవమానిస్తే.. జగన్ తలెత్తుకునేలా చేశారు- వైసీపీ మంత్రులు

Ministers Praises CM Jagan (Photo : Facebook)

సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రులు. సీఎం జగన్ బీసీలకు పదవులు ఇచ్చి, తల ఎత్తుకునేలా చేశారని కొనియాడారు. ఏలూరు జిల్లా కైకలూరులో సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేశ్, విడదల రజినీ, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కావాలి జగన్.. రావాలి జగన్ అంటున్నారు- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
వైసీపీ సామాజిక బస్సు యాత్రకు అపూర్వమైన స్పందన వస్తోంది. సామాజిక న్యాయం జరగడానికి కైకలూరు కూడా ఒక కారణం. జయమంగళ వెంకట రమణను చంద్రబాబు మోసం చేశారు. జగన్ మోహన్ రెడ్డి జయమంగళ వెంకటరమణను ఎమ్మెల్సీ చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపించారు. మోపిదేవి వెంకట రమణను రాజ్యసభకు పంపి మన వాణి వినిపించేలా చేశారు.

మరి చంద్రబాబు ఏం చేశారు? ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించారా? చంద్రబాబు వెంట ఉన్న బీసీ నాయకులు తల ఎక్కడ పెట్టుకుంటారు? 136 కులాలను వెలికి తీసి 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లను వేశారు. జగన్ గొప్ప నాయకుడు. రాష్ట్రంలోని యాదవులంతా రావాలి జగన్.. కావాలి జగన్.. అంటున్నారు. నాడు-నేడు ద్వారా మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు జగన్. చదువుల్లో ఏపీని మూడవ స్థానానికి తీసుకొచ్చారు.

Also Read : వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

బీసీలకు దక్కిన గౌరవానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ- మోపిదేవి వెంకటరమణ
పేదరికం తొలగించేందుకు జగన్ కృషి చేశారు. గతంలో బీసీలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారు. గత పాలకులు రాజ్యసభ సీట్లను కూరగాయల బేరంలా అమ్ముకున్నారు. అలాంటి సంస్కృతికి జగన్ చెక్ పెట్టారు. బీసీలను జగన్ రాజ్యసభకు పంపించారు. బీసీలకు దక్కిన ఈ గౌరవానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. జగన్ మమ్మల్ని తలెత్తుకుని తిరిగేలా చేశారు.

చంద్రబాబుకి, పవన్ కు ఏపీలో చిరునామా లేదు. అంపశయ్య మీద ఉన్న టీడీపీని బతికించాలని పవన్ తహతహలాడుతున్నారు. రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి పవన్. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనేదే పవన్ ఆరాటం.

చంద్రబాబు, పవన్ జనంలోకి వచ్చి ఏం చేస్తారు?- మంత్రి జోగి రమేశ్
బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. జగనన్న కటౌట్ కే వేల మంది తరలి వస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ కు గుండె దడదడ కొట్టుకుంటోంది. జగనన్నకు భయం చూపిస్తానన్న లోకేశ్ భయపడ్డారు. 79 రోజులు భయపడిన సన్నాసి లోకేశ్.

మంత్రులకు భయం చూపిస్తానంటున్నాడు లోకేశ్. నీ అయ్య కరకట్ట దగ్గరకే వచ్చినోళ్లం. మాకెందుకు భయం? నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించిన ఘనత జగనన్నకు మాత్రమే దక్కింది. 17మందిని మంత్రులను చేసి క్యాబినెట్ లో కూర్చోబెట్టారు. అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్ ఆలోచలన్నీ కలిసిన వ్యక్తి జగన్. చంద్రబాబు, పవన్ జనంలోకి వచ్చి ఏం చేస్తారు? 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోకు సమాధానం చెప్పాకనే.. చంద్రబాబు, పవన్ ఓటు అడగాలి.

Also Read : బెయిల్ రద్దుపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

చంద్రబాబు చిన్నచూపు చూశారు, అవహేళన చేశారు- మంత్రి విడదల రజనీ
జ్యోతిరావు పూలే ఆశయాల సాధకుడు జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీలను అంటరాని వారిగా చూశారు. చంద్రబాబు బీసీలను చిన్నచూపు చూసి అవహేళన చేశారు. జగన్ మోహన్ రెడ్డి బీసీలను అందలం ఎక్కించారు. చంద్రబాబు హయాంలో గిరిజనులను పట్టించుకోలేదు. అది సామాజిక వెనుకబాటుతనం. గిరిజనులకు అన్ని వసతులు కల్పించడం సాధికారత. ఈ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగనన్న సామాజిక
సాధికారత కల్పించారు.

బడుగు బలహీన వర్గాలు జగనన్నకు ముందు.. జగనన్న తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నారు. రాజకీయంగా, ఉద్యోగాల పరంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేశారు. ప్రభుత్వ వైద్యం ఇంటికే అందిస్తున్న ఘనత జగన్ మోహన్ రెడ్డిది. చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకునేందుకు వృద్ధులు ఎన్నో అవస్థలు పడేవారు. జగనన్న ఇంటి వద్దకే పింఛన్లను అందిస్తున్నారు. మనకు జరిగిన సామాజిక సాధికారతను తెలియజేసేందుకే ఈ సంబరాలు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా జగన్ కి అండగా ఉండాలి.

అందరికీ న్యాయం చేసిన నాయకుడు జగన్- ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ
టీడీపీలో నాకు ఎమ్మెల్యేగా గౌరవం దక్కలేదు. నియోజకవర్గం ఇంఛార్జిగానూ గౌరవం దక్కలేదు. ప్రతీ ఒక్కరికి సామాజిక న్యాయం చేసిన నాయకుడు జగన్. బీసీల సమస్య బీసీలకే తెలుస్తుందని నమ్మిన వ్యక్తి జగన్. అందుకే ఒక బీసీ అయిన నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు.