Chandrababu : బెయిల్ రద్దుపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పేర్కొంది.

Chandrababu : బెయిల్ రద్దుపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

Chandrababu (5)

Chandrababu bail cancellation petition : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ రద్దుపై చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్కిల్ డెవపల్ మెంట్ కేసులో 17 ఏ పై తీర్పు వచ్చిన తరువాత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పేర్కొంది. సిఐడి పిటిషన్ పై చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందన్న అంశాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సిఐడి తెలిపింది.

Priyanka Gandhi : దేశంలో ఫామ్ హౌస్ లో ఉండి పాలించే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ : ప్రియాంక గాంధీ

స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దు : సుప్రీంకోర్టు

రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సిఐడి అభ్యర్ధనను సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. మధ్యంతర బెయిల్ సమయంలో హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలన్న సిఐడి అభ్యర్ధనను సుప్రీం ధర్మాసనం త్రోసిపుచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇరు పక్షాలూ స్కిల్ డెవలప్ మెంట్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాదని సుప్రీంకోర్టు సూచించింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్రబాబుకు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

CM Jagan : సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన సీఎం జగన్

ఏపీ సిఐడి పిటిషన్ లో కీలక అంశాలు

ఏపీ సిఐడి పిటిషన్ లో కీలక అంశాలు పేర్కొంది. చంద్రబాబుకు బెయిల్ విషయంలో హైకోర్టు పరిధి దాటిందని ఆరోపించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించిందని తెలిపింది. కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉందని అభిప్రాయపడింది. మినీ ట్రయల్ నిర్వహణ జరిగిందనడానికి 39 పేజీల తీర్పే నిదర్శనమని పేర్కొంది.

దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించారు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలున్నా హైకోర్టు ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉందన్నారు. సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధమని అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో తేలేంతవరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ సిఐడి కోరారు.