Balakrishna : చంద్రబాబును జైల్లో పెట్టేందుకే స్కామ్‌ను క్రియేట్ చేశారు : ఎమ్మెల్యే బాలకృష్ణ

చంద్రబాబు అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కుట్రేనని బాలకృష్ణ అన్నారు. స్కామ్ జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని ఇది వైసీపీ ప్రభుత్వం పన్నిన కుట్ర అని..తాను జైల్లో ఉండి వచ్చారు కాబట్టి చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైల్లో పెట్టాలనే కుట్రేనన్నారు.

Balakrishna : చంద్రబాబును జైల్లో పెట్టేందుకే స్కామ్‌ను క్రియేట్ చేశారు : ఎమ్మెల్యే బాలకృష్ణ

MLA Balakrishna

Updated On : September 12, 2023 / 2:57 PM IST

Hindupur MLA Balakrishna : చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేత, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మీడియా వేదికగా స్పందిస్తు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబును జైల్లో పెట్టేందుకు స్కామ్ ను క్రియేట్ చేశారు అంటూ ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ముమ్మాటికి రాజకీయ కుట్రేనన్నారు. స్కామ్ జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని, ఇది వైసీపీ ప్రభుత్వం పన్నిన కుట్ర అన్నారు. తాను జైల్లో ఉండి వచ్చారు కాబట్టి చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైల్లో పెట్టాలనే కుట్రలో భాగంగానే ఆయనను అరెస్ట్ చేశారంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు బాలకృష్ణ. టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదనే భయంతోనే ఈ అరెస్ట్ జరిగిందన్నారు.

Yarapathineni Srinivasa Rao : చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ దిద్దుకోలేని తప్పు చేశారు : యరపతినేని శ్రీనివాస్

పాలన చేతకాక ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వం పరిమితమవుతోందని..చంద్రబాబును జైల్లో పెట్టాలనే కుట్రతోనే స్కామ్ జరిగిందని క్రియేట్ చేసారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో యువతకు స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ కింద 2లక్షల 13వేలమందికి ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు బాలకృష్ణ. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రేమ్ చంద్రారెడ్డి పేరు ఎక్కడా లేదన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగాలు కల్పించామని.. హిందూపురంలో బాబ్ మేళా నిర్వహించామని.. అర్హులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

Chandrababu : జైల్లో చంద్రబాబు ఉదయాన్నే లేచి ఏం చేశారో తెలుసా..?

అన్నింటిమీద పన్నులు రుద్దు ప్రజలకు జగన్ ప్రభుత్వం భారాలు పెంచుతోందని, ఈ విషయం ప్రజలు గుర్తించాలని సూచించారు. చెత్త మీద కూడా పన్ను వేసిన ప్రభుత్వం కేవలం జగన్ దేనంటూ ఎద్దేవా చేశారు. చెత్తమీద కూడ పన్నులు వేసి జగన్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందనిన్నారు. జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన గన్ జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గంజాయి రాజ్యంగా మారిపోయిందన్నారు. యువత మత్తుకు బానిసనలు అవుతున్నారని, ఇదంతా జగన్ ప్రభుత్వంలోనే జరుగుతోందంటూ విమర్శించారు. నవరత్నాల పేరుతో రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు.

Balakrishna : చంద్రబాబు అరెస్ట్‌తో బరిలోకి బాలయ్య.. ముఖ్య నేతలతో కీలక సమావేశం, దేనికైనా రెడీ అన్న బాలయ్య బాబు

చంద్రబాబు పాలన అభివృద్ధి..జగన్ పాలన టైమ్ పాస్..
అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించినంత మాత్రాన భయపడేది లేదని, ఇటువంటి కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. ఈ ఆరోపణల నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారని అన్నారు. ఇటువంటి ఆరోపణలకు అరెస్టులకు భయపడేది లేదని న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రజల పక్షాన ఎప్పటికి టీడీపీ ఉంటుందని అన్నారు. మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని.. మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం టైమ్ పాస్  చేసిందంటూ బాలకృష్ణ ఎద్దేవా చేశారు.

Akhilesh Yadav : చంద్రబాబు అరెస్ట్ చట్టవిరుద్ధం : అఖిలేశ్ యాదవ్

చంద్రబాబు దావోస్ నుంచి పెట్టుబడులు తెస్తే జగన్ మొఖం వేలాడేసుకొచ్చి పరువు తీశారు..
ఏపీలో ఇక వైసీపీతో యుద్ధం మొదలైందన్నారు.ప్రతి కార్యకర్త సుశిక్షితులైన సైనికుల్లా పోరాడాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.జగన్ పాలన గాలికి వదిలేసి ప్రతిపక్షాల పై దాడులు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారని..16నెలలు జైల్లో ఉన్న జగన్… 16 నిమిషాలైనా చంద్రబాబుని జైల్లో పెట్టాలనుకున్నారని..లోకేష్ తో పాటు మరికొందరు నాయకులపై కేసులు పెట్టడానికి సిద్దమయ్యారని అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కేసులకు భయపడాల్సిన పనిలేదని కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.దావోస్ వెళ్లిన ప్రతిసారి చంద్రబాబు వేల కోట్ల పెట్టుబడిల ఒప్పందాలు చేసుకొచ్చారు. కానీ జగన్ ఒకేసారి వెళ్లి మోహం వేలాడేసుకుని వచ్చి ఏపీ పరువు తీశారు అంటూ ఎద్దేవా చేశారు.ప్రజలు కూడా మౌనంగా ఉండకుండా రోడ్లపైకి రావాలని..ఊరకుక్కలు ఏదో మొరిగితే భయపడాల్సిన పనిలేదన్నారు.జగన్ కు ఒక్క ఛాన్స్ అంటే జాలిపడి అవకాశమిచ్చారని కానీ ఇచ్చిన అవకాశాన్ని రాజకీయ కక్షలుకు ఉపయోగించుకున్నారని విమర్శించారు.

CM Mamata Banerjee : చంద్రబాబు అరెస్టుపై సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు