Kolikapudi Srinivasa Rao: ఎంపీ కేశినేని చిన్నికి రూ.5 కోట్లు ఇచ్చా..! సంచలనం సృష్టిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి పోస్ట్..
నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మొబైల్ స్టేటస్ పెట్టారు.

Kolikapudi Srinivasa Rao: టీడీపీ తిరువూరు రాజకీయం రచ్చకెక్కింది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన పోస్ట్ చేశారు. 2024 ఎన్నికల్లో కేశినేని చిన్నికి పలు దఫాలుగా 5 కోట్లు ఇచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాలను మొబైల్ స్టేటస్ గా పెట్టుకున్నారు. బ్యాంకు ద్వారా కేశినేని చిన్ని పీఏ మోహన్ కి నగదు ట్రాన్స్ ఫర్ చేశానని కొలికపూడి చెప్పారు.
ఎంపీ కేశినేని చిన్నికి ఇచ్చిన నగదుపై రేపు మాట్లాడుకుందాం, నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మొబైల్ స్టేటస్ పెట్టారు. అటు తనపై ఆరోపణలను జనం నమ్మరంటూ కొలికపూడి వ్యాఖ్యలను ఎంపీ కేశినేని చిన్ని తిప్పికొట్టారు. ఈ వ్యవహారంపై రేపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కొలికపూడి శ్రీనివాసరావు కలవనున్నారు.
గత కొంత కాలంగా తిరువూరు టీడీపీలో ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే.. ఇద్దరి మధ్య ఇప్పటివరకు ఉన్న కోల్డ్ వార్.. పూర్తి స్థాయిలో డైరెక్ట్ ఫైట్ గా మారింది. ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేశినేని శివనాథ్ పై చేసిన పోస్టు చాలా సంచలనంగా మారింది. 2024 ఎన్నికల్లో ఎంపీకి రూ.5 కోట్ల నగదు ఇచ్చినట్లుగా ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు, దానికి సంబంధించిన బ్యాంక్ లావాదేవీల స్క్రీన్ షాట్స్ ను ఎమ్మెల్యే కొలికపూడి మీడియాకు విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న వార్.. డైరెక్ట్ ఫైట్ గా మారింది.
తనపై వచ్చిన ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని అంతే ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎవరి దగ్గరి నుంచి ఎలాంటి నగదును ఆశించే స్థితిలో లేనని తేల్చి చెప్పారు. అంతేకాదు తన సొంత డబ్బుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని వివరణ ఇచ్చుకున్నారు.
తిరువూరు టీడీపీ నాయకత్వంలో వర్గ పోరాటం ఇప్పటిది కాదు. ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గంగా పార్టీ చీలిపోయింది. దీనిపై పలు దఫాలుగా పార్టీ హైకమాండ్ పిలిపించి మాట్లాడింది. పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. తిరువూరు టీడీపీ నాయకత్వం ఒకదారికి రాలేదు.
Also Read: వైసీపీ కోవర్టులు ఎవరో అందరికీ తెలుసు.. వారి అంతు చూస్తా- ఎంపీ కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు