TDP : రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు సీఎం కావాలి, దళితులంటే జగన్‌కు చిన్న చూపు- టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు
జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని అన్నారు. చిల్లు పడిన వైసీపీ నావ త్వరలోనే మునిగిపోతుందన్నారు. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతారో తెలియదన్నారు చంద్రబాబు.

YSRCP MLAs Joins TDP
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. వారిద్దరూ చంద్రబాబు సమక్షంలో ఇవాళ టీడీపీలో చేరారు. అనంతరం మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉదయగిరిలో నాలుగుసార్లు గెలిచిన నాకే జగన్ టికెట్ ఇవ్వలేదు అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాను సీఎం జగన్ పేరు మర్చిపోయి చాలా రోజులైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు సీఎం కావాలని ఆయన అన్నారు. జగన్, మంత్రుల కన్నా లోకేశ్ చాలా గొప్ప నాయకుడు అని కితాబిచ్చారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.
Also Read : కేంద్రంలో మోదీని గద్దె దించాలి.. ఏపీలో జగన్‌ను ఇంటికి పంపాలి : సీపీఐ రామకృష్ణ
నాయక్ అంటూ వచ్చి ఖల్నాయక్ అయ్యారని సీఎం జగన్ పై మండిపడ్డారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. దళితులంటే సీఎం జగన్ కు చిన్న చూపు అని ఆరోపించారామె. దళిత ఎమ్మెల్యే అయిన నాకు వైసీపీలో అవమానాలు ఎదురయ్యాయని వాపోయారు. దళితులని చంపి స్విగ్గీ, జొమోటాలో డోర్ డెలివరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చిల్లు పడిన వైసీపీ నావ త్వరలోనే మునిగిపోతుందన్నారు. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతారో తెలియదన్నారు చంద్రబాబు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ తమ జీవితాలకు భద్రత కోరుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. అపరిచితుడు లాంటి జగన్ చెప్పిందేదీ చేయరని మండిపడ్డారు. తల్లికి, చెల్లికి కూడా సమయo ఇవ్వని వ్యక్తి ఇక ఎమ్మెల్యేలకు ఏం ఇస్తాడు? అని ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్రం మీదకు ఓ అరాచక సైన్యాన్ని జగన్ వదిలిపెట్టారని చంద్రబాబు అన్నారు.
Also Read : జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు