Varudu Kalyani : లంచాలు తినే వాడి కోసం కంచాలు మోగించారు.. టీడీపీ దీక్షపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు

అధికార దుర్వినియోగం చేసి హెరిటెజ్, ఇతర ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 1997 నుండి ఇప్పటి వరకు చంద్రబాబుపై 17 కేసులు ఉన్నాయని తెలిపారు.

Varudu Kalyani : లంచాలు తినే వాడి కోసం కంచాలు మోగించారు.. టీడీపీ దీక్షపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు

MLC Varudu Kalyani

Varudu Kalyani – TDP Deeksha : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు చేప్టటిన దీక్షలపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న టీడీపీ నేతల దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లంచాలు తినే వాడి కోసం కంచాలు మోగించారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు మంగళవారం విశాఖలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కడిగిన ముత్యం కాదు అవినీతిలో మునిగిన ముత్యం అని ఆరోపించారు.

‘మీరు ఎందుకు దీక్ష చేస్తున్నారు? కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా చేస్తున్నారా? మీకు రాజ్యాంగం వర్తించదా? మీరు సొంతంగా చంద్రబాబు రాజ్యాంగం సృష్టించుకున్నారా? అవినీతి చక్రవర్తికి అబద్దాల భార్యగా మీరు వ్యవహరిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం చేసి హెరిటెజ్, ఇతర ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.

Boy Kidnap : తిరుపతి బస్టాండ్ లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా..

1997 నుండి ఇప్పటి వరకు చంద్రబాబుపై 17 కేసులు ఉన్నాయని తెలిపారు. ‘మీరు ఏ తప్పు చేయకపోతే మీ ఆస్తులపై సీబీఐ, ఈడీ, సిట్టంగ్ జడ్జీలతో విచారణ చేయాలని దీక్ష చేయవచ్చు కదా’ అని అన్నారు. చంద్రబాబు కన్నా రాజకీయ సైకో ఎవ్వరు లేరని అనిత తెలుసుకోవాలని సూచించారు. అనితకు జగన్ పేరు పలికే అర్హత లేదని విమర్శించారు.

‘మీరు కిడ్నాప్ లు పక్క రాష్ట్రంలో చేసుకోండి ఇక్కడ కాదు’ అని అఖిలప్రియను ఉద్దేశించి మాట్లాడారు. జైలు గోడలు బద్దలు కొడతారా.. ఎలా కొడతారో కొట్టండి చూద్దాం అని సవాల్ చేశారు. ‘మీ సైకో అనందం కోసం పిల్లలను క్రిమినల్స్ గా చేస్తారా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఓ పిల్లాడితో దారుణంగా మాట్లడించారు.. దేవాన్హ్ తో మాట్లడించవచ్చు కదా అని అన్నారు.