Suspension TDP Members : అసెంబ్లీలో సెల్‌‌ఫోన్స్ నిషేధం.. 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేస్తున్నారు. సభా సంప్రదాయాలను పాటించాలని, చర్చలకు సహకరించి హుందాగా మెలగాలని స్పీకర్ సూచించారు...

Suspension TDP Members : అసెంబ్లీలో సెల్‌‌ఫోన్స్ నిషేధం.. 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Ap Assembly Speaker Tammineni Sitaram Suspends Five Tdp Mlas From Ap Assembly (1)

Updated On : March 17, 2022 / 11:51 AM IST

Mobile Phones Banned Inside AP Assembly : ఏపీ అసెంబ్లీకి సెల్ ఫోన్స్ తీసుకరావద్దని ఎమ్మెల్యేలకు సూచించారు స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. సభలో జరుగుతున్న దృశ్యాలు బయట కనిపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. జంగారెడ్డి గూడెంలో మిస్టరీ మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేస్తున్నారు. సభా సంప్రదాయాలను పాటించాలని, చర్చలకు సహకరించి హుందాగా మెలగాలని స్పీకర్ సూచించారు. 2022, మార్చి 17వ తేదీ గురువారం ఆందోళన చేస్తున్న ఒకరోజు పాటు సస్పెన్షన్ వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. సత్యప్రసాద్, రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, అశోక్, చిన రాజప్ప, సాంబశివరావు, గొట్టిపాటి రవి, జోగేశ్వరరావు, గణబాబు, భవానీలు సస్పెన్షన్ అయిన వారిలో ఉన్నారు.

Read More : Chandrababu On Jagan : మళ్లీ వైసీపీ వస్తే.. ఎవరూ బతకరు-చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీకి చెందిన నాయకులు జంగారెడ్డిగూడెం మృతుల మిస్టరీపై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మిస్టరీ మరణాలు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు కారణాలు కనుక్కోలేకపోయిందని రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మృతుల మిస్టరీకి కారణం నాటుసారానే అని టీడీపీ అంటుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా తోడై పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. వరుస మరణాలు.. ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్నాయి. మున్ముందు.. ఇంకెన్ని మరణాలు సంభవిస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక్కసారిగా అస్వస్థతకు గురై.. చనిపోతుండటంతో.. స్థానికుల్లో భయాందోళన మొదలైంది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరడం, చికిత్స కొనసాగుతుండగానే మరణించడం.. ఇప్పుడు మిస్టరీగా మారింది. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో తదితర విభాగాలు వరుస మరణాలకు కారణాలపై ఆరా తీస్తున్నాయి. కల్తీ సారా తాగి జనాలు చనిపోతుంటే ప్రభుత్వం తప్పుడు వివరణ ఇస్తున్నదని అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.