Model Dairy : మోడల్ డైరీ ఓనర్ దారుణ హత్య
జంగారెడ్డిగూడెంలో ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మోడల్ డైరీ ఓనర్ సురేష్ ప్రభు దారుణ హత్యకు గురయ్యారు.

Model Dairy
Model Dairy : పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. జంగారెడ్డిగూడెంలో ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మోడల్ డైరీ డిస్ట్రిబ్యూటర్ సురేష్ ప్రభు దారుణ హత్యకు గురయ్యారు. అర్ధరాత్రి 1.45గంట సమయంలో అతడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయన తీవ్ర గాయాలయ్యాయి.
108 సాయంతో వెంటనే స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేష్ ప్రభు మృతి చెందారు. కాగా హత్య ఉదంతం స్థానికంగా ఉన్న సీసీకెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.
Read More : Electric Highway : ఇకపై భవిష్యత్తు ఇదే.. ఇండియా ఫస్ట్ ‘ఎలక్ట్రిక్ హైవే’ రాబోతోంది.. ఎక్కడంటే?