Heavy Rains : తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంద్ర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని తెలిపింది.

Heavy Rains (13)
Andhra Pradesh Heavy Rains : ఈశాన్య బంగాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం (Cyclone) తీరం దాటింది. బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మధ్య ఉన్న పశ్చిమ గంగానది తీరాల మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటింది. బంగ్లాదేశ్ (Bangladesh) కు 160 కిలోమీటర్ల వెస్ట్ బెంగాల్ (West Bengal) లోని కోల్ కత్తాకు 70 దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రికృతమైందని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 12 గంటల్లో మరింత బలహీన పడి వాయుగుండంగా మారే ఆవకాశం ఉంది.
పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం కొనసాగుతోంది. రుతుపవనాలు చురుగ్గగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంద్ర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని తెలిపింది.
Rain today updates : పలు రాష్ట్రాల్లో నేడు భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరికలు జారీ
ఈ నేపథ్యంలో ఏపీలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.