“మొంథా” తుపాను.. నేడు, రేపు, ఎల్లుండి.. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉండనుందంటే?
అక్టోబర్ 28 ఉదయం నాటికి ఉత్తర-వాయవ్య దిశగా కదిలి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది.
Montha Cyclone: మొంథా తుపాను ఆగ్నేయ బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో గత 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ ఉదయం 8.30 గంటలకు నైరుతి, పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై, అక్షాంశం 12.6° ఉత్తర అక్షాంశం, 85.0°తూర్పు రేఖాంశం, చెన్నై (తమిళనాడు)కి తూర్పు-ఆగ్నేయంగా 520 కి.మీ దూరంలో, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 570 కి.మీ దూరములో విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 600 కి.మీ దూరములో, గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణంగా 750 కి.మీ దూరములో, పోర్ట్ బ్లెయిర్ (అండమాన్, నికోబార్ దీవులు)కి పశ్చిమాన 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది అక్టోబర్ 28 ఉదయం నాటికి ఉత్తర-వాయవ్య దిశగా కదిలి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తర-వాయవ్య దిశగా మరింత కదులుతూ, అక్టోబర్ 28 సాయంత్రం/రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్యకాకినాడ పరిసరాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరము దాటే సమయములో స్థిరమైన పెనుగాలులు గంటకు 90-100 కి.మీ.. అలాగే, గరిష్ఠంగా110 కి.మీ వేగంతో వీస్తాయి .
నేడు, రేపు, ఎల్లుండి.. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా?
ఉత్తర కోస్తా (ఆంధ్రప్రదేశ్), యానాం
నేడు: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
Also Read: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రైల్వే శాఖ అప్రమత్తం.. ఈ రైళ్లు అన్నీ రద్దు..
దక్షిణ కోస్తా (ఆంధ్రప్రదేశ్)
నేడు: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశ ఉంది.
రాయలసీమ
నేడు: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది.
