Gorantla madhav gives complaint: తన న్యూడ్ వీడియో వ్యవహారంపై సీఐడీకి ఫిర్యాదు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో, తనపై కక్షతో మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోని సృష్టించారని సీఐడీకి గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్‌పై దర్యాప్తు జరపాల్సిందిగా సీఐడీ అడిషనల్ డీజీకి మాధవ్ లేఖ రాశారు. మార్ఫింగ్ వీడియోను ఐటీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని లేఖలో పేర్కొన్నారు.

Gorantla madhav gives complaint
Gorantla madhav gives complaint: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో, తనపై కక్షతో మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోని సృష్టించారని సీఐడీకి గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్‌పై దర్యాప్తు జరపాల్సిందిగా సీఐడీ అడిషనల్ డీజీకి మాధవ్ లేఖ రాశారు. మార్ఫింగ్ వీడియోను ఐటీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని లేఖలో పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో ఐటీడీపీ పని చేస్తుందని.. చింతకాయల విజయ్, నారా లోకేశ్ కూడా ఉన్నారని తెలిపారు. దీంతో సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. మాధవ్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ (నంబరు 12/2022) నమోదు చేశారు. కాగా, గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడినట్లు ఉన్న వీడియో కొన్ని రోజుల క్రితం సంచలనం సృష్టించింది. అయితే, ఆ వీడియో నకిలీదని, జిమ్‌లో తాను వ్యాయామం చేస్తున్న వీడియోను మార్ఫింగ్ చేశారని అన్నారు. టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆయన మొదటి నుంచి అంటున్నారు.