Election Commission: ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి

ప్రతి 1,000 మందిలో 714 మంది ఓటర్లు ఉండాలని అన్నారు.

Election Commission: ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నాం: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి

Mukesh Kumar Meena

Updated On : June 19, 2023 / 5:50 PM IST

Election Commission: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer) ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రత్యేకంగా ప్రచారం చేశామని వివరించారు.

ఓటర్ల జాబితా విషయంలో రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 17న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తామని అన్నారు. అనంతరం అభ్యంతరాల స్వీకరణ ముగిశాక, 2024, ఫిబ్రవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.

రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించుకోవచ్చని చెప్పారు. ప్రతి 1,000 మందిలో 714 మంది ఓటర్లు ఉండాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ ఉందని వివరించారు. ఓటులేని వారు ఇప్పుడు ఓటు నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఓటర్ల జాబితా ప్రక్రియను పారదర్శకంగా రూపొందిస్తామని చెప్పారు. ఏపీలో యువ ఓటర్లు చాలా తక్కువ ఉన్నారని తెలిపారు.

సీఎస్ఈ సాఫ్ట్ వేర్ ద్వారా తాము 10.20 లక్షల మంది డబుల్ ఓటర్లను గుర్తించామని చెప్పారు. డూప్లికేట్ ఓటర్లను మాత్రమే తొలగించామని, ఎక్కడా ఓటర్లను తొలగించలేదని తెలిపారు. చాలా మంది ఓటర్లను తీసేసారని వస్తున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. వాలంటీర్లు ఎన్నికల కమిషన్ లో భాగం కాదని స్పష్టం చేశారు.

Chandrababu : 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండీ .. లేదంటే తప్పుకోండీ : చంద్రబాబు వార్నింగ్