Devuni Kadapa: వేంకటేశ్వర స్వామికి ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Devuni Kadapa: వేంకటేశ్వర స్వామికి ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు

Devuni Kadapa temple

Updated On : March 30, 2025 / 2:31 PM IST

Lord Venkateswara: దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ఆలయాన్ని తిరుమల తొలి గడపగా పిలుస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే, ఉగాది పండుగ రోజున ముస్లిం మహిళలు పెద్దెత్తున తరలివచ్చి ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తారు. తరతరాలుగా ఉగాది రోజున ఈ ఆచారాన్ని వారు అనుసరిస్తున్నారు.

Also Read: Rasi Phalalu: ఈ ఏడాది ఏ రాశి వారి అదృష్ట సంఖ్య ఏది? కలిసొచ్చే వారం.. కలిసొచ్చే రంగులు.. అదృష్ట దైవం.. పూర్తి వివరాలు..

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముస్లిం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, ఈ ఆలయానికి ముస్లిం భక్తులు తరలిరావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. బీబీ నాంచారమ్మను వారు తమ ఇంటి ఆడబిడ్డగా.. వేంకటేశ్వర స్వామి తమ ఇంటి అల్లుడుగా భావించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కారణంగా వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడుగా భావించి చీర, సారె భత్యం సమర్పించడం ఆనవాయితీ
గా వస్తుంది. తరతరాల ఆనవాయితీని నేటికీ ముస్లిం భక్తులు కొనసాగిస్తున్నారు.