Nadendla Manohar: పవన్ కల్యాణ్‌ను ఎవరైనా ఇంతలా దూషిస్తే ఈ తీరును..: నాదెండ్ల మనోహర్
మేయర్ ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. చట్టం అందరికీ సమానమని...

Nadendla Manohar
Nadendla Manohar – Kavati Manohar: జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను ఎవరైనా దూషిస్తే ఈ తీరును ఎవరూ అంగీకరించబోరని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కల్యాణ్‌పై తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నిర్వహించిన బంద్‌పై నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్‌లో జనసేన శ్రేణులు పాల్గొన్నారని చెప్పారు. కావటి మనోహర్ కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అన్నారు.
మేయర్ ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. చట్టం అందరికీ సమానమని, కొందరు రాజకీయ లబ్ధి కోసమే అనేక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. తమ పార్టీ ఎన్నడూ హింసను ప్రోత్సహించబోదని అన్నారు. మేయర్ చేసిన అనుచిత వాఖ్యలు వెనక్కి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తాము పోలీసులకు సూచించామని తెలిపారు.
అయినప్పటికీ పోలీసులు దీనిపై తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు. మేయర్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. అటువంటి వ్యాఖ్యలు చేస్తే సూమోటోగా కేసులు పెట్టామని సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పిందని గుర్తు చేశారు. సహనం కోల్పోకూడదని తాము ఆలోచిస్తున్నామని చెప్పారు.