Minister Roja : జగన్ చేతిని ముద్దాడిన రోజా

సీఎం  జగన్‌ను ఎంతో అభిమానించే రోజా ఈరోజు ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం జగన్ వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు. జగన్ ఆమెను ఆశీర్వదించారు. అనంతరం రోజు జగన్ చేతిని తీసుకుని ముద్దాడా

Minister Roja : జగన్ చేతిని ముద్దాడిన రోజా

Roja Oath Takes As Ap Minister

Updated On : April 11, 2022 / 2:56 PM IST

Minister Roja :  ఈరోజు జరిగిన ఏపీ నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో కొన్ని అరుదైన సంఘటనలు జరిగాయి. కొందరు మంత్రులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి పాదాభివందనం చేస్తే, బొత్స తన రూటే సెపరేట్ అన్నట్టు ముందుగా గవర్నర్ కు అభినందనలు తెలిపారు.

కాగా సీఎం  జగన్‌ను ఎంతో అభిమానించే రోజా ఈరోజు ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం జగన్ వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు. జగన్ ఆమెను ఆశీర్వదించారు. అనంతరం రోజు జగన్ చేతిని తీసుకుని ముద్దాడారు.

డిగ్రీ చదువు మధ్యలో ఆపేసి సినిమాల్లోకి వచ్చిన రోజా సినిమాల్లో హీరోయిన్‌గా రాణించారు. అనంతరం 1999లో రాజకీయాల్లోకి వచ్చిన రోజా మొదట తెలుగుదేశం పార్టీలో పని చేశారు. 2004, 2009లలో తెలుగుదేశం పార్టీ తరుఫున నగరి, చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి 2014,2019లో నగరి నియోజక వర్గం నుంచి గెలుపొందారు. 2019 నుంచి రెండేళ్ల పాటు ఏపీ ఐఐసీ చైర్మన్ గా పని చేశారు.
Also Read : Botsa Satyanarayana : బొత్స రూటే సెపరేటు… మొదట గవర్నర్‌కు ధన్యవాదాలు