Nara Lokesh : గూగుల్‌లో దొరికే సమాధానాలే నన్ను అడిగారు, నేను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే కుట్ర ఇది- సీఐడీ విచారణపై నారా లోకేశ్

గత 31 రోజులుగా సీఐడీ అధికారులు ఎలాంటి తమాషాలు ఆడారో అందరికీ తెలుసు. Nara Lokesh

Nara Lokesh : గూగుల్‌లో దొరికే సమాధానాలే నన్ను అడిగారు, నేను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే కుట్ర ఇది- సీఐడీ విచారణపై నారా లోకేశ్

Nara Lokesh On CID Investigation

Updated On : October 10, 2023 / 8:46 PM IST

Nara Lokesh On CID Investigation : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ అధికారులు టీడీపీ నేత నారా లోకేశ్ ను విచారించారు. సిట్ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. సీఐడీ విచారణ ముగిసిన తర్వాత నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. సీఐడీ విచారణ గురించి పలు విషయాలు చెప్పారు. సీఐడీ అధికారుల తీరుపై లోకేశ్ మండిపడ్డారు. దాదాపు ఆరున్నర గంటలపాటు విచారణ జరిగిందని, ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని 50 ప్రశ్నలు తనను అడిగారని లోకేశ్ తెలిపారు. ఒకే ప్రశ్న ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ముందుకు ప్రతిపాదన వచ్చిందా? అని అడిగారని వెల్లడించారు.

”గూగుల్ లో దొరికే సమాధానాలే సీఐడీ అధికారులు నన్ను అడిగారు. నా ముందు వాళ్లు ఎలాంటి ఆధారాలు పెట్టలేదు. నేను హెరిటేజ్ ఈడీగా ఎలా పని చేశానో వాటికి సంబంధించి 50 ప్రశ్నల వరకూ అడిగారు. ఇది కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోంది. నేను, చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా ఈరోజే ఎంత సమయమైనా ఉంటా అని చెబితే మళ్లీ రేపు రమ్మని 41A నోటీసు ఇచ్చారు.

Also Read : టీడీపీ- జనసేన పొత్తుపై విష్ణుకుమార్‌ రాజు హ్యాపీ.. ఆయన సంబరానికి కారణమేంటి?

నాకు రేపు వేరే పని ఉందని చెప్పినా, రేపు మళ్లీ ఉదయం 10 గంటలకు విచారణకు రమ్మన్నారు. కచ్చితంగా వస్తా. అవగాహన లేని సైకో జగన్ ఎన్నైనా మాట్లాడతాడు. ఆయన డీజీపీ దగ్గర పాఠాలు చెప్పించుకుంటే మంచిది. తెలుగుదేశం పార్టీ అంటే భయం కాబట్టే మా కార్యకర్తలు కొవ్వొత్తులు పట్టినా, విజిల్ ఊదినా కేసులు పెడుతున్నారు. గత 31 రోజులుగా సీఐడీ అధికారులు ఎలాంటి తమాషాలు ఆడారో అందరికీ తెలుసు” అని నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read : చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు