Nara Lokesh : జగన్ పాలనకు ఎక్స్‌పైరీ డేట్ మూడు నెలలే : నారా లోకేశ్
జగన్ పాలనకు ఎక్స్ పైరీ డేట్ కేవలం మూడు నెలలే అని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు.

Nara Lokesh
Nara Lokesh-CM Jagan : ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విమర్శలు చేశారు. జగన్ పాలనకు ఎక్స్‌పైరీ డేట్ కేవలం మూడు నెలలే అన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఈ మూడు నెలల్లోను తగలేస్తున్నావంటే నిన్ను ఏమనాలి..? అంటూ ప్రశ్నించారు. ప్రజారాజధాని అమరావతిలో సెక్రటేరియట్ ని టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించింది.. అదే సెక్రటేరియట్ లో కూర్చుని ఇదేం రాజధాని అంటున్నారని ఎద్దేవా చేశారు.
”విశాఖని రాజధాని చేస్తానంటారు.. కోర్టుల ఆదేశాలున్నా వ్యవస్థల్ని బెదిరించి దొడ్డిదారిన ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించేందుకు జీవోలిప్పిస్తారు.. ఐటీ డెవలప్మెంట్ కోసం టిడిపి సర్కారు కట్టిన మిలీనియం టవర్స్‌ని ఖాళీ చేయిస్తారు అంటూ విమర్శించారు. వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలని పక్కరాష్ట్రాలకి తరిమేస్తారు.. వేలాది మందికి ఉద్యోగాలు లేకుండా చేస్తారు. రుషికొండని ధ్వంసం చేశారు. కైలాసగిరిని నాశనం చేశారు. విశాఖని విధ్వంసం చేసి ఆ శిథిలాలపై కూర్చుని ఏం చేస్తారు” అంటూ ప్రశ్నించారు.
Also Read: విశాఖలో పాలన దిశగా ఏపీ సర్కారు అడుగులు.. ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయింపు
కాగా.. విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలను కేటాయిస్తు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.. మంత్రులు, ఉన్నతాధికారులు, ఆయా శాఖల కార్యదర్శలకు భవనాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ శాఖలకు భవనాలను కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.