జఫ్ఫాలు.. This is వాస్తవం: నారా లోకేష్ సెటైర్

అధికారపార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి నారా లోకేష్. మూడు రాజధానులకు మద్దతుగా చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెకు దగ్గరలో వైసీపీ నేతలు భారీ బహిరంగ సభను నిర్వహించారు. చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెకు సమీపంలోని రంగపేటలో సభను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేశారు. అయితే ఈ అంశంపై ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతల వరుస ఆందోళనలు వ్యక్తం చెయ్యగా నారావారిపల్లెలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ క్రమంలోనే సభకు వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలావరకు హాజరయ్యారు. అయితే జనం మాత్రం పెద్దగా కనిపించలేదు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయంటూ కొన్ని వీడియోలు.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ సభకు సంబంధించిన విజువల్స్ వీడియో పోస్టు చేశారు నారా లోకేష్. ‘జప్ఫాలు… This is వాస్తవం’ అంటూ కాస్త వెటకారంగా వైసీపీని ఉద్ధేశించి ట్వీట్ చేశారు.
రంగంపేటలో వైసీపీ సభలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు కల్లాం అజయ్ రెడ్డి ప్రసంగం తర్వాత ప్రజలు సభ నుంచి వెళ్లిపోగా కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. దీంతో అక్కడ సభ విఫలం అయ్యిందంటూ టీడీపీ వైసీపీపై విమర్శలు చేస్తుంది. ఈ ప్రాంతం చంద్రగిరి నియోజకవర్గంలో ఉండగా.. ఆ నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.