Nara Lokesh: కడప శివారులోని పాలకొండ వద్ద నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్.. ఏమన్నారంటే?

" పాలకొండను మింగేసిన వైసీపీ అనకొండలు " అని పేర్కొన్నారు.

Nara Lokesh: కడప శివారులోని పాలకొండ వద్ద నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్.. ఏమన్నారంటే?

Nara Lokesh Selfie Challenge

Updated On : June 8, 2023 / 8:18 PM IST

Nara Lokesh – TDP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌(Jagan)కు టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి సెల్ఫీ ఛాలెంజ్ ( Selfie Challenge) విసిరారు. ” పాలకొండను మింగేసిన వైసీపీ అనకొండలు ” అని పేర్కొన్నారు.

వైసీపీ అక్రమార్కులు కంటిపడితే చాలు కొండలు, గుట్టలు మాయమైపోతున్నాయని నారా లోకేశ్ అన్నారు. ఇది కడప శివారు చలమారెడ్డిపల్లిలోని పాలకొండ అని చెప్పారు. వైసీపీ నేతలు ఈ కొండను దాదాపు 6 కిలో మీటర్ల పొడవునా తవ్వేసి ట్రక్కు రూ.5 వేల చొప్పున అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు.

తాగునీరు, కరెంటు సహా ఎటువంటి మౌలిక సౌకర్యాలు లేని ఇదే ప్రాంతంలో పేదలకు సెంటుపట్టాలిచ్చి డబుల్ దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. ” జలగన్న పాలనలో వైసీపీ అనకొండల అడ్డగోలు దోపిడీకి ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే ” అని నారా లోకేశ్ చెప్పారు. గతంలోనూ పలు ప్రాంతాల్లో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కొన్ని వారాల క్రితం సెల్ఫీ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీలు దిగారు. ఏపీలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అని చంద్రబాబు అన్నారు.

CM KCR-Sharwanand: సీఎం కేసీఆర్‌ను క‌లిసిన హీరో శ‌ర్వానంద్‌.. ముచ్చ‌టేంటంటే..?