Nara Lokesh Teleconference: రాజకీయ కక్ష సాధింపుల గురించి నాయకులంతా ప్రతీఇంటికి వెళ్లి ప్రచారం చేయాలి
చంద్రబాబు అరెస్ట్ తో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించనున్నారు.

Nara Lokesh
Nara Lokesh: చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై ముఖ్య నేతలతో నారా లోకేశ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాల వారికి పార్టీ తరుపున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని లోకేశ్ సూచించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని అభిప్రాయపడ్డారు. ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని నేతలు ఖండించారు.
Lokesh yuvagalam padayatra : యువగళం పాదయాత్ర మళ్లీ మొదలవుతుందా..? నేతలకు లోకేశ్ ఏం చెప్పారంటే
అదేవిధంగా లోకేష్ యువగళం పున: ప్రారంభంపైనా ముఖ్యనేతల సమావేశంలో చర్చ జరిగింది. వచ్చేవారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించే యోచనలో నారా లోకేశ్ ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించనున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో నిత్యం సంప్రదిస్తున్న లోకేశ్ అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూ.. ఇటు యువగళంతో మళ్లీ రోడ్డెక్కాలని నిర్ణయించినట్లు తెలిసింది.