Nara Lokesh: పోలవరం నిర్వాసితుల సమస్యలపై జగన్ కు లోకేష్ లేఖ
పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు

Lokesh
Nara Lokesh: పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోలవరం నిర్వాసితులు గత నాలుగు వారాలుగా దీక్షలు చేస్తున్నారని.. వారి డిమాండ్లు పరిష్కరించి దీక్ష విరమింపజేయాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, అధికారులు వచ్చి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామిఇచ్చారని.. ఈసమస్య మీదాకా వచ్చినట్లు అగుపించడం లేదని లోకేష్ పేర్కొన్నారు. ఈమేరకు పోలవరం నిర్వాసితులు ఎదుర్కొంటున్న ఏడు ప్రధాన సమస్యలను లోకేష్ సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు.
Also read: Jaggareddy: సీనియర్ల సలహాలో జగ్గారెడ్డి, వీహెచ్ తో కీలక భేటీ
2013 భూసేకరణ చట్టం అమలు చేసి పోలవరం నిర్వాసితులందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలని కోరారు. సీఎం జగన్ గతంలో ప్రకటించిన రూ.10 లక్షల ప్యాకేజీ అందించాలన్నా లోకేష్, 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేసారు. నిర్వాసితుల్లో అత్యధిక మంది సొంత గృహాలు కూడా లేక.. అద్దె గృహాల్లో నిసిస్తున్నారన్న లోకేష్, ప్రభుత్వం త్వరగా వారికి ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు కేటాయించిన కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. గ్రామాలను ఖాళీ చేయించిన తేదీనే కటాఫ్ తేదీగా పరిగణించాలని లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్షనేతగా వున్నప్పుడు నిర్వాసితులకు మీరిచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డిపై ఉందని లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
Also read: Old Man: వృద్ధుడిని హతమార్చిన మరో వృద్ధుడు