Nara Lokesh: గత ఎన్నికల్లో ఓడిన నియోజక వర్గంలోకి స్వాతంత్ర్య దినోత్సవం వేళ లోకేశ్.. భారీగా మోహరించిన పోలీసులు
లోకేశ్ ఆ నియోజక వర్గంలో అడుగుపెట్టకముందే వివాదం రాజుకుంది. మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం దద్దరిల్లిపోయింది.

Nara Lokesh (@naralokeshofficial)
Nara Lokesh – Mangalagiri : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని మంగళగిరి నియోజక వర్గం(Mangalagiri Assembly constituency)లో మంగళవారం నుంచి టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. నాలుగు రోజులపాటు మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు.
లోకేశ్ ఆ నియోజక వర్గంలో అడుగుపెట్టకముందే వివాదం రాజుకుంది. లోకేశ్ కు స్వాగతం పలుకుతూ టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఆర్కే, కమిషనర్ కు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. వారి ఆందోళనతో మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం దద్దరిల్లిపోయింది.
అనుమతులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫ్లెక్సీలను పెట్టుకునేందుకు కమిషనర్ అనుమతి ఇవ్వలేదని టీడీపీ నేతలు వాపోయారు. దీంతో అక్కడకు టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు, ఇప్పటికే ఆ నియోజకవర్గంలో టీడీపీ భారీ వాహన ర్యాలీ నిర్వహించింది.
Perni Nani: టీడీపీ ఈ పని చేసిన చోట జనసేన ఆ పని చేయదు: పేర్ని నాని