రోడ్డు మార్గంలో సభా ప్రాంగణంకు మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ భాజపా ప్రజాచైతన్య సభలో ప్రసంగించబోతున్నారు. విశాఖ విమానాశ్రయంకు చేరుకున్న మోడీ రోడ్డు మార్గంలో సభ జరుగుతున్న రైల్వే మైదానంకు బయల్దేరారు. మోడీ పర్యటనకు రెండు రోజుల ముందు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ను కేంద్రం ప్రకటించగా.. పర్యటనపై ప్రజలలో సానుకూలత ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసిన బీజేపీ నేతలు మోడీ రాకతో రాజకీయంగా మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా పాకిస్తాన్ కు భారత్ కు మధ్య వివాదాలు చోటుచేసుకున్న నేపధ్యంలో సభలో మోడీ ప్రసంగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారీ సెక్యూరిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. మరోవైపు, మోడీ పర్యటనను నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.