కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచి పంపిణీ
చెన్నైలో ఈ కార్డులను ముద్రించారు. ఇప్పటికే ఏపీలోని మండల కేంద్రాలకు రవాణా చేసే ప్రక్రియ ప్రారంభమైంది.

smart ration cards
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. ఏటీఎం కార్డుల తరహాలో ఉండే ఈ కొత్త రేషన్ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటుంది.
వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ జరుగుతుంది. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే సరుకులు ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేసింది.
కొత్త రేషన్ కార్డులను ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్‌తో ఆకర్షణీయంగా రూపొందించారు. స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం నెల రోజుల క్రితం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా టెండరు ప్రక్రియ పూర్తిచేశారు. చెన్నైలో ఈ కార్డులను ముద్రించారు. ఇప్పటికే ఏపీలోని మండల కేంద్రాలకు రవాణా చేసే ప్రక్రియ ప్రారంభమైంది.