Vizag Railway zone: వైజాగ్ కేంద్రంగా కొత్త ‘సౌత్ కోస్ట్’ రైల్వే జోన్.. మొత్తం 4 డివిజన్లు..!

South Coast Railway zone : విశాఖపట్నం కేంద్రంగా 410 కి.మీ పరిధితో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు అయింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, గుంతకల్లు రైల్వే డివిజన్లు ఉంటాయి.

Vizag Railway zone: వైజాగ్ కేంద్రంగా కొత్త ‘సౌత్ కోస్ట్’ రైల్వే జోన్.. మొత్తం 4 డివిజన్లు..!

New south coast railway zone to be set up with visakhapatnam

Updated On : February 5, 2025 / 6:28 PM IST

South Coast Railway zone : ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త.. ఏపీలో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కన్ ఫాం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద మైలురాయిగా ఈ కొత్త రైల్వే జోన్ ఏర్పాటు అయింది. వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ (South Coast) ఏర్పాటును భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. తాజా నిర్ణయంతో వైజాగ్ రైల్వే డివిజన్‌ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో భాగం కానుంది. ప్రస్తుత వాల్తేర్ రైల్వే డివిజన్‌ను వైజాగ్ రైల్వే డివిజన్‌గా మార్చనున్నారు.

Read Also : Ola Roadster X series : కొత్త ఎలక్ట్రిక్ బైక్ ​కొంటున్నారా? ఓలా రోడ్‌స్టర్​ ఎక్స్ ​వచ్చేసింది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర కేవలం రూ. 74,999 మాత్రమే!

కొత్త రైల్వే జోన్ ప్రకారం.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్లు గుంటూరు రైల్వే డివిజన్లు ఉండనున్నాయి. మరో విషయం ఏమిటంటే.. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ కూడా విజయవాడ డివిజన్‌లో విలీనం కానుంది. ప్రస్తుతం విజయవాడ శివార్లలోని కొండపల్లి విభాగం సికింద్రాబాద్ డివిజన్‌లోనే ఉంది. ఇప్పటినుంచి ఈ సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌లో భాగం కానుంది.

Read Also : New Tax Regime : రూ. 12 లక్షలు కాదు.. రూ. 13 లక్షల 70 వేల వరకు జీరో ట్యాక్స్.. మీరు చేయాల్సిందిల్లా ఇదొక్కటే..!

410 కి.మీ పరిధిలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ :
కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మొత్తం 410 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు కానుంది. ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే సర్వీసులను మరింత సమర్ధంగా అందుబాటులోకి రానున్నాయి.
ఈ రైల్వే జోన్ ఏర్పాటుపై నిర్ణయం ప్రాంతీయ ప్రాభావంతో పాటు పాలనా సౌలభ్యాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త రైల్వే జోన్ ఏర్పాటును రాష్ట్ర ప్రాంతీయ ప్రయాణికుల ప్రయోజనాల దృష్ట్యా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా అందించనున్నారు.