వావ్.. తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్య సీట్లు ఎన్ని పెరగనున్నాయో తెలుసా? స్టూడెంట్స్‌లో నూతనోత్సాహం..
పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత విద్యారంగ నిపుణులు ఎడ్యుకేషన్‌కు సంబంధించిన లెక్కలు వేసుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్య సీట్లు పెరగనున్నాయి. దీంతో ఆయా కోర్సులు చేయాలనుకునేవారిలో నూతనోత్సాహం వచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె.. భారత్‌లో వైద్య సీట్లను పెంచబోతున్నట్లు తెలిపారు.
ఏడాదికి కనీసం 10 వేల సీట్ల చొప్పున పెంచనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఐదేళ్లలో కనీసం 75,000 సీట్లు పెరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 8 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇవి ఐదేళ్లలో 3,000-5,000 మధ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో యూజీ మెడికల్ సీట్లు 12,000 వరకు చేరుతాయి.
గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐ తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు.. రూ.లక్ష ఎఫ్‌డీ వేస్తే ఏ మేరకు లాభమో తెలుసా?
కాగా, భారత్‌లో ఉన్న 23 ఐఐటీల్లో అదనంగా మౌలిక సదుపాయాలు కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో 10 ఏళ్ల కిత్రం ఐఐటీ సీట్ల సంఖ్య 65,000. ఇప్పుడు ఆ సంఖ్య 1.35 లక్షలకు పెరిగింది. దీంతో స్టూడెంట్స్‌కి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా మరిన్ని మౌలిక సదుపాయాలను కేంద్ర సర్కారు కల్పించనుంది.
మరోవైపు, స్కిల్‌డెవలప్‌మెంట్, ఉన్నత విద్యలో పెట్టుబడులపై దృష్టి పెట్టడంలో భాగంగా 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను కేంద్ర సర్కారు స్థాపించనుంది. ఇవి మేకి ఇండియాతో పాటు మేక్ ఫర్ ది వరల్డ్ ఆశయాలకు అనుగుణంగా స్కిల్స్ నేర్చుకునేందుకు ఉపయోగపడతాయి. దాదాపు రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.