గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐ తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు.. రూ.లక్ష ఎఫ్‌డీ వేస్తే ఏ మేరకు లాభమో తెలుసా?
ఎఫ్‌డీలు వేస్తే ఎన్నో లాభాలు పొందవచ్చు. వాటిపై లోన్లు కూడా తీసుకోవచ్చు.

SBI latest FD rates
దేశంలోని అతి పెద్ద బ్యాంక్ “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” వృద్ధుల కోసం ఎన్నో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పథకాలను అందిస్తోంది. ఈ బ్యాంకులో వృద్ధులకు అందించే ఎఫ్డీ రేట్లు సాధారణంగా ఇతరులకు అందించే వాటి కంటే అధికంగా ఉంటాయి. దీంతో “ఫిక్స్‌డ్ డిపాజిట్” అత్యంత ప్రాధాన్యం కలిగిన పెట్టుబడి ఆప్షన్‌గా మారింది.
ఎఫ్‌డీలు గ్యారంటీ రిటర్న్స్‌ను అందిస్తాయి. దీంతో మెచురిటీగా తాము ఎంత తిరిగి పొందుతామన్న విషయంపై ఎఫ్‌డీలు వేసేవారికి ముందుగానే అవగాహన ఉంటుంది. వృద్ధుల కోసం ఎస్‌బీఐ అందించే వివిధ ఎఫ్‌డీ రేట్ల గురించి తెలుసుకుందాం..
ఎస్‌బీఐ అమృత్ వృష్టి పథక వడ్డీ రేటు: ఈ పథకానికి 444 రోజుల వ్యవధి ఉంటుంది. ఈ పథకం ద్వారా 7.75 శాతం వడ్డీ రేటును అందుకోవచ్చు. రూ. లక్ష పెట్టుబడిపై వృద్ధులు మెచ్యురిటీపై రూ.1,07,978 పొందొచ్చు.
ఏడాది ఎఫ్‌డీ పథకం: ఎస్‌బీఐ ఏడాదికి రూ.లక్ష పెట్టుబడిపై వృద్ధులకు 7.30 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అంటే ఏడాదికి రూ.లక్ష ఎఫ్‌డీ వేస్తే వారు రూ.1,07,502 పొందవచ్చు.
రెండేళ్ల ఎఫ్‌డీ పథకం: ఎస్‌బీఐ రెండేళ్ల ఎఫ్‌డీ రేటు 7.50 శాతం. రూ.లక్ష పెట్టుబడిపై వృద్ధులు ఇందులో మెచ్యురిటీగా రూ.1,07,714 పొందుతారు.
మూడేళ్ల ఎఫ్‌డీ పథకం: దీని కింద ఎస్‌బీఐ మూడేళ్ల ఎఫ్‌డీలపై వృద్ధులకు 7.25 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. రూ.లక్షల పెట్టుబడిపై వృద్ధులు రూ.1,07,450 పొందవచ్చు.
ఐదేళ్ల ఎఫ్‌డీ పథకం: ఈ పథకం కింద ఎస్‌బీఐ 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో రూ.లక్ష పెట్టుబడిపై వృద్ధులు రూ.1,07,714 పొందవచ్చు.
నామినేషన్ సౌకర్యం: ఎస్‌బీఐ నామినేషన్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. డిపాజిటర్ల మెచ్యూరిటీ మొత్తాన్ని అతడు/ఆమె.. తమ కుటుంబ సభ్యులను నామినేట్ చేయవచ్చు.
ఎఫ్‌డీలపై రుణాలు: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ లోన్లను కూడా అందిస్తుంది. ఇతర లోన్లతో పోల్చుకుంటే ఎఫ్‌డీలపై ఇచ్చే రుణాల వడ్డీరేట్లు కూడా తక్కువ.