Train Stopped : వాటర్ లేవు, ఏసీ పని చేయదు.. కట్టలు తెంచుకున్న కోపం, రైలుని ఆపేసిన ప్రయాణికులు
Elamanchili Railway Station : ట్రైన్ ను ఆపేసి ప్లాట్ ఫామ్ పై ఆందోళనకు దిగారు. ఏసీ టికెట్ ధరలు తీసుకుని కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు మండిపడ్డారు.

Train Stopped
Elamanchili Railway Station : విశాఖ నుంచి తిరుమల వెళ్తున్న ఓ రైలులో సౌకర్యాలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ పని చేయడం లేదని యలమంచిలి రైల్వే స్టేషన్ లో నిరసనకు దిగారు. ట్రైన్ ను ఆపేసి ప్లాట్ ఫామ్ పై ఆందోళనకు దిగారు. ఏసీ టికెట్ ధరలు తీసుకుని కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు మండిపడ్డారు. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. ప్రయాణికుల ఆందోళనతో రైలు చాలాసేపు నిలిచిపోయింది.
ప్రయాణికుల ఆందోళనతో రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. రైల్వే అధికారులు ప్రయాణికులతో మాట్లాడారు. వారు ఇచ్చిన హామీతో ప్రయాణికులు తమ ఆందోళన విరమించారు. దాంతో ట్రైన్ తిరుమలకు బయలుదేరింది. విశాఖలో మ.2గంటల ప్రాంతంలో ఈ రైలు బయలుదేరింది. ఎండలు మండిపోతుండటంతో చాలామంది ఏసీ బోగీల్లో ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే ఎక్కువ మంది ఏసీ బోగీల్లో రిజర్వేషన్ చేయించుకున్నారు. అయితే, ఏసీ బోగీల్లో ఏసీ పని చేయలేదు.
Also Read..Rs 2000 denomination: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉంటే ఇలా మార్చుకోండి.. టెన్షన్ వద్దు.
మరోవైపు స్లీపర్ క్లాస్ లోనూ వాటర్ ప్రాబ్లమ్ ఉంది. ఇటు ఏసీ లేదు, అటు నీటి సమస్య.. దాంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పిల్లలు, వృద్ధులతో వెళ్తున్న సమయంలో ఈ పరిస్థితి ఏంటని ప్రయాణికులు సీరియస్ అయ్యారు. అయితే, రైల్వే అధికారులు దాటవేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అప్పటివరకు ఓపిక పట్టిన ప్రయాణికులు.. రైలు యలమంచిలి రైల్వే స్టేషన్ కు చేరుకోగానే ప్రయాణికుల్లో కోపం కట్టలు తెంచుకుంది. రైలుని ఆపేసిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం దారుణం అన్నారు.
Also Read..Rs 2000 denomination: రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నాం: ఆర్బీఐ సంచలన ప్రకటన
రైల్వే అధికారులు స్పష్టమైన హామీ ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని ప్రయాణికులు తేల్చి చెప్పారు. అయితే, రైల్వే సిబ్బంది ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు. ఏసీ పని చేయడం లేదు. వాటర్ ప్రాబ్లమ్ కూడా ఉంది. మేము అంతదూరం(తిరుమల) వరకు ఎలా ప్రయాణం చేయాలని ప్రయాణికులు ప్రశ్నించారు. ఈలోపు అక్కడికి చేరుకున్న రైల్వే అధికారులు.. ఏసీకి సంబంధించి తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించారు. అనంతరం రాజమండ్రి వెళ్లాక వాటర్ సదుపాయం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక సమస్యతో వాటర్ కూడా బంద్ అయ్యింది. వాటర్ ప్రాబ్లమ్ కూడా మేము పరిష్కరిస్తాము, ఆందోళన విరమించి ట్రైన్ బయలుదేరేలా చూడాలని ప్రయాణికులను రైల్వే అధికారులు కోరారు. దాంతో ప్రయాణికులు ఆందోళనను విరమించారు.