Rs 2000 denomination: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉంటే ఇలా మార్చుకోండి.. టెన్షన్ వద్దు..

అప్పట్లో పలు బ్యాంకుల ముందు లాఠీచార్జీలూ జరిగాయి. దీంతో ఇఫ్పుడు రూ.2 వేల నోట్లు భారీగా ఉన్నవారు మళ్లీ ఆందోళన చెందుతున్నారు.

Rs 2000 denomination: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉంటే ఇలా మార్చుకోండి.. టెన్షన్ వద్దు..

Reserve Bank of India

Reserve Bank of India: దేశంలో రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) సంచలన ప్రకటన చేయడంతో అందరికీ 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు గుర్తుకు వస్తోంది. అప్పట్లో కరెన్సీ నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూలు కనపడ్డాయి.

పలు బ్యాంకుల ముందు లాఠీచార్జీలూ జరిగాయి. దీంతో ఇఫ్పుడు రూ.2 వేల నోట్లు భారీగా ఉన్నవారు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. అయితే, 2016లో దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు ఉండకపోవచ్చు. రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ 5 నెలల సమయం ఇచ్చింది. బ్యాంకులతో పాటు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.

అంతేగాక, అలాగే, బ్యాంకుల్లో డిపాజిట్లపై ఆంక్షలు లేవు. మే 23 నుంచి ఒక విడతలో 10 నోట్లను అంటే రూ.20,000ను మార్చుకునే అవకాశం ఉంది. సెప్టెంబరు 30లోగా నోట్లను మార్చుకోవాలి. అంటే 5 నెలల సమయం కూడా ఉంది. అంతేగాక, సెప్టెంబరు 30 వరకు రూ.2 వేల నోట్లు చలామణీలోనే ఉంటాయి.

బ్యాంకుల్లో రోజుకు కేవలం 10 నోట్లు మాత్రమే మార్చుకోవచ్చు. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు ఆర్బీఐ త్వరలోనే దేశంలోని అన్ని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేయనుంది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగాయి. నోట్ల వాడకం చాలా తగ్గింది. రూ.2 వేల నోటు అతి తక్కువగా వాడుతున్నారు.

Rs 2000 denomination: రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నాం: ఆర్బీఐ సంచలన ప్రకటన