Visakhapatnam Mayor : విశాఖ మేయర్‌పై అవిశ్వాసం..! వారం రోజుల్లో పీఠాన్ని కైవసం చేసుకునేలా కూటమి సర్కార్ ప్లాన్..
అవిశ్వాసం వీగిపోయి మేయర్ పీఠాన్ని తన ఖాతాలోనే ఉంచుకోవాలని వైసీపీ చూస్తోంది.

Visakhapatnam Mayor : గ్రేటర్ విశాఖలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మేయర్ పీఠంపై గురిపెట్టిన కూటమి.. అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. అవిశ్వాస తీర్మానంతో అలర్ట్ అయిన వైసీపీ.. క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు వైసీపీ కార్పొరేటర్లతో మంతనాలు జరిపారు. వైసీపీ కార్పొరేటర్లను ఊటీ తరలించాలని నిర్ణయించారు. అవిశ్వాసం వీగిపోయి మేయర్ పీఠాన్ని తన ఖాతాలోనే ఉంచుకోవాలని వైసీపీ చూస్తోంది.
అయితే, ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూటమికి మద్దతు పలికారు. అటు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు ప్రియదర్శిని సైతం వైసీపీకి దూరంగా ఉంటున్నారు. వచ్చే వారం రోజుల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది.
Also Read : నాతో రాయబారం నడిపావా? లేదా? విడదల రజినిపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలనం.. కాల్ డేటాపై..
గ్రేటర్ విశాఖ పాలిటిక్స్ హీటెక్కాయి. మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును రెండు రోజుల క్రితమే విశాఖ కలెక్టర్ కు అందజేశారు. ఒకటి రెండు రోజుల్లో కౌన్సిల్ ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి భావిస్తున్న తరుణంలో వైసీపీ సైతం కూడా అవిశ్వాస తీర్మానం వీగిపోయే విధంగా అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. నిన్న వైసీపీ కార్పొరేటర్ల అందరితోనూ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కన్నబాబు మంతనాలు జరిపారు. అనంతరం వాళ్లంతా క్యాంప్ కి వెళ్లాలని నిర్ణయించారు. వారంతా ఇప్పటికే క్యాంపులకు బయలుదేరారు. కొందరు ఊటీకి, మరికొందరు బెంగళూరుకు కుటంబ సమేతంగా బయలుదేరి వెళ్తున్నారు.
అయితే 6వ వార్డుకు సంబంధించి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె వస్తారా రారా అన్న సందిగ్ధంలో వైసీపీ ఉంది. ఇటీవలే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసినా.. ఆయన కుమార్తె ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. వారం రోజుల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి నేతలు వ్యూహాలు పన్నారు.
Also Read : మేయర్ పీఠంపై టీడీపీ కన్ను..! కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో రసవత్తర రాజకీయం..
కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ కార్పొరేటర్లు సైతం టీడీపీ పార్టీలో చేరారు. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు, కార్పొరేటర్ల ఓట్లు అన్నీ చూసుకుంటే..దాదాపు 73 వరకు చేరింది. ఇది కాకుండా అవంతి శ్రీనివాస్ కూతురు సైతం కూటమికి మద్దతు ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. సీపీఐ, సీపీఎంకు సంబంధించి ఒక్కో సీట్లు ఉన్నాయి. వారు కూడా మద్దతు ప్రకటిస్తారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి భావిస్తోంది.