Kurnool Mayor Seat : మేయర్ పీఠంపై టీడీపీ కన్ను..! కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో రసవత్తర రాజకీయం..

గతంలో 52 లో 43 డివిజన్లు గెలిచిన వైసీపీ.. మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.

Kurnool Mayor Seat : మేయర్ పీఠంపై టీడీపీ కన్ను..! కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో రసవత్తర రాజకీయం..

Updated On : March 23, 2025 / 9:35 PM IST

Kurnool Mayor Seat : కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయం రసవత్తరంగా మారబోతోంది. మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ త్వరలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మార్చి 19తో మేయర్ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కావడంతో ప్రస్తుత మేయర్ పై అవిశ్వాసం పెట్టే దిశగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇక కర్నూలు మేయర్ కార్పొరేషన్ లో 52 కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం టీడీపీకి ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి 24 మంది సభ్యులు ఉన్నారు.

Also Read : అన్యమత ఉద్యోగులు బదిలీ..! టీటీడీలో సంస్కరణలపై సీఎం చంద్రబాబు ఫోకస్..

గతంలో 52 లో 43 డివిజన్లు గెలిచిన వైసీపీ.. మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఇటీవల ఆరుగురు కార్పొరేటర్లు టీడీపీతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఆరుగురు వైసీపీకి దూరమైతే ఆ పార్టీ సంఖ్యా బలం 37కి పడిపోనుంది. ఈ క్రమంలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. పీఠాన్ని కోల్పోకుండా ఉండేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.

కర్నూలు నగర మేయర్ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తైంది. దీంతో టీడీపీ కూటమి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మేయర్ గా బీవై రామయ్య పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి సన్నద్ధమైంది. మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కార్పొరేటర్లు కర్నూలు నగరానికి ఉన్నారు.

మొత్తం 52 కార్పొరేటర్లు ఉన్నారు. 36 మంది కర్నూలు నగరానికి సంబంధించిన వారు, 16 మంది పాణ్యం నియోజకవర్గం, ముగ్గురు కోడుమూరు నియోజకవర్గానికి చెందిన వారు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. గతంలో 43 మంది కార్పొరేటర్లతో వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మేయర్ దింపేసి పీఠాన్ని దక్కించుకోవాలని కూటమి చూస్తోంది. 28 మంది కార్పొరేటర్ల బలం ఉంటే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే మేయర్ సీటుపై టీడీపీ కన్నువేసింది.