No Poll Tax : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పోల్ ట్యాక్స్ రద్దు
కేబుల్ ఆపరేటర్లపై ఏపీ ప్రభుత్వం పోల్ ట్యాక్స్ విధించలేదని ఏపీ మాజీమంత్రి పేర్నినాని అన్నారు. కేబుల్ ఆపరేటర్లతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుందని చెప్పారు.

No Poll Tax : కేబుల్ ఆపరేటర్లపై ఏపీ ప్రభుత్వం పోల్ ట్యాక్స్ విధించలేదని ఏపీ మాజీమంత్రి పేర్నినాని అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతున్న సీఎస్ సీ కేబుల్ నెట్ ఎక్స్ పోకి చీఫ్ గెస్ట్ గా పేర్నినాని హాజరయ్యారు. కేబుల్ ఆపరేటర్లతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుందని చెప్పారు.
భీమవరం కమ్యూనిటీ నెట్ వర్క్ స్టాల్స్ ని ఆయన సందర్శించారు. సరికొత్త టెక్నాలజీతో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారంటున్న ఎస్ఎస్ ఎల్ సీ అధినేత కిషోర్ ని అభినందించారు. పే, ఫ్రీ చానల్స్ తో పాటు ఓటీటీ, ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నామని కిషోర్ అన్నారు.
”ఏపీ ప్రభుత్వం పోల్ ట్యాక్స్ వసూలు చేయడం లేదు. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కేబుల్ ఆపరేటర్లతో ఫ్రెండ్లీగా ఉంటున్నాం. నిరుద్యోగ యువత వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి తన కుటుంబాన్ని తనతో పాటు నాలుగైదు కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న వ్యవస్థ కేబుల్ టీవీ” అని పేర్నినాని అన్నారు.