మరింత భద్రత : సీఎం జగన్ భద్రతకు ఆక్టోపస్ టీమ్

  • Published By: madhu ,Published On : December 19, 2019 / 02:26 AM IST
మరింత భద్రత : సీఎం జగన్ భద్రతకు ఆక్టోపస్ టీమ్

Updated On : December 19, 2019 / 2:26 AM IST

ఏపీ సీఎం జగన్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఆక్టోపస్ టీం ఆయనకు భద్రత కల్పించనుంది. 30 మంది సభ్యులతో కూడిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్టు ఆపరేషన్స్ (ఆక్టోపస్) టీం రంగంలోకి దిగింది. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం తాడేపల్లిలోని సీఎం ఇంటి వద్ద విధులు చేపట్టింది. ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడ్డాయి.

ప్రస్తుతం ఉన్న ఇంటెలిజెన్స్ సెక్యూర్టీ వింగ్ (ISW)తో పాటు పనిచేస్తుంది. సీఎం జగన్ వెంటే ఈ టీం ఉండనుంది. ఆయన పర్యటనలు, సభలు, సమావేశాల్లో పటిష్ట భద్రతను కల్పించనుంది. ఇద్దరు అధికారులు ఈ టీమ్‌లను పర్యవేక్షించనున్నారు. 

OCTOPUS అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్టు ఆపరేషన్స్. ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనే ప్రత్యేక దళం. 
ఆక్టోపస్ ఏపీ పోలీసుల్లో ఒక భాగం. 
మొన్నటి వరకు SPF పోలీసులతో పాటు గన్ మెన్లు సీఎం జగన్‌కు భద్రత పర్యవేక్షించే వారు. 
 

టెర్రరిస్టు ఆపరేషన్స్ కోసం పత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటారు. 
వీరు స్పెషల్ ఆపరేషన్స్‌లో కీలకంగా వ్యవహరిస్తుంటారు. 
సీఎంతో పాటు VIPల భద్రతకు సంబంధించిన అంశాలను హోం సెక్రటరీ, డీజీపీ, లా ఆర్డర్ ఐజీ, ఇంటిలిజెన్స్ చీఫ్‌తో కూడిన సెక్యూర్టీ రివ్యూ కమిటీ తీసుకుంటుంది. 
Read More : మాటల మంటలు : జేసీ క్షమాపణలు చెప్పాల్సిందే పోలీసులు