Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వేలాది మంది భక్తులు

భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడుతోంది. ఒడిశా సాంప్రదాయ నృత్యాలతో చిన్నారులు అలరించారు.

Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వేలాది మంది భక్తులు

Puttaparthi Saibaba

Updated On : August 11, 2023 / 7:59 PM IST

Puttaparthi – Odisha: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వేలాది మంది భక్తులు వచ్చారు. సత్యసాయి పాదుక యాత్రతో ప్రశాంతి నిలయం చేరుకున్నారు ఒడిశా భక్తులు. సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.

ఒడిశాకు చెందిన పలువురు మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడుతోంది. ఒడిశా సాంప్రదాయ నృత్యాలతో చిన్నారులు అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతి నిలయంలో ఆధ్యాత్మిక శోభ మరింత పెరిగింది. సత్యసాయి నామస్మరణతో సాయి నిలయం పులకించిపోయింది.

Jana Gana Mana : జాతీయ గీతాన్ని ఎన్ని సెకండ్లలో పాడాలో తెలుసా?