Bus Accident : జల్లేరు వాగు నుంచి బస్సు వెలికితీత

ప్రమాదానికి గురైన బస్సు..జంగారెడ్డిగూడెం డిపోకు చెందినదిగా గుర్తించారు. క్రేన్ సహాయంతో బస్సును బయటికి తీశారు. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Bus Accident : జల్లేరు వాగు నుంచి బస్సు వెలికితీత

Bus

Updated On : December 15, 2021 / 4:53 PM IST

Extracted Bus from Jalleru stream : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరువాగులో పడిన బస్సును అధికారులు బయటికి తీశారు. క్రేన్ల సాయంతో బస్సును బయటికి లాగారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి బస్సును బయటికి తీశారు. బస్సు ప్రమాదంలో డ్రైవర్ సహా 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 13 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

బస్సు అశ్వరావుపేట నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వంతెన రెయిలింగ్ ను ఢీకొని జల్లేరువాగులో బస్సు బోల్తా పడింది. 50 అడుగుల ఎత్తు నుంచి బస్సు వాగులో పడింది. ప్రమాదానికి గురైన బస్సు..జంగారెడ్డిగూడెం డిపోకు చెందినదిగా గుర్తించారు. క్రేన్ సహాయంతో అధికారులు బస్సును బయటికి తీశారు.

Bus Accident : బస్సులో టెక్నికల్ సమస్యలు లేవు..మానవ తప్పిదం వల్లే ప్రమాదం

బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారు. కాగా బస్సు వేలేరుపాడులో నైట్ హాల్ట్ ఉన్నది. ఉదయం భద్రాచలం వెళ్లి అశ్వారావుపేట మీదుగా జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తోంది. జంగారెడ్డిగూడెంకు 10 కి.మీ దూరంలో బస్సు ప్రమాదానికి గురైంది.

బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ ను జగన్ ఆదేశించారు.