Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. సుంకేసుల నుంచి 21,241 క్యూసెక్కులు, జూరాల నుంచి 18,000 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం జలాశయంలో చేరుతుంది.

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

Srisailam Reservoir

Updated On : June 12, 2021 / 12:48 PM IST

Srisailam Reservoir: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. సుంకేసుల నుంచి 21,241 క్యూసెక్కులు, జూరాల నుంచి 18,000 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం జలాశయంలో చేరుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అగుడులు కాగా ప్రస్తుతం 810.90 అడుగులకు చేరింది.

ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34.83 టిఎంసీలు ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం పైన ఉన్న జూరాల, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. దీంతో పైనుంచి వచ్చిన వరద నీరు చాలావరకు శ్రీశైలం జలాశయంలో చేరుకుతుంది.