Chevireddy Bhaskar Reddy: మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసుల నోటీసులు
ఇటువంటి నోటీసులకు, కక్షసాదింపులకు భయపడేదిలేదని.. దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ పార్టమెంట్ ఇన్‌చార్జి మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందించారు. ఒంగోలులో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైసీపీ జెండా ఆవిష్కరించేందుకు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు చెవిరెడ్డి.
ఆయన జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పాతకేసుల్లో విచారణకు హాజరుకావాలని చెవిరెడ్డికి చెప్పారు. నోటీసులు అందుకున్న అనంతరం.. పార్టీ కార్యాలయం నుంచి ఒంగోలు కలెక్టరేట్ వరకు ఇవాళ వైసీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు చెవిరెడ్డి ర్యాలీగా బయలుదేరారు.
Also Read: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో రోబో రెస్క్యూ ఆపరేషన్.. ఈ రోబోలు ఏయే పనులు, ఎలా చేస్తాయి?
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తమ వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ఇటువంటి నోటీసులకు, కక్షసాదింపులకు భయపడేదిలేదని.. దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు.
కాగా, వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్స వం వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ జెండా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ‘యువత పోరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సర్కారు తీరును ఎండగడుతూ భారీ ర్యాలీగా కలెక్టరేట్లకు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.